బాయ్‌ఫ్రెండ్‌ ఎందుకు భరించాలి? | Why should the boyfriend bear? | Sakshi
Sakshi News home page

బాయ్‌ఫ్రెండ్‌ ఎందుకు భరించాలి?

Sep 6 2017 12:17 AM | Updated on Sep 17 2017 6:26 PM

బాయ్‌ఫ్రెండ్‌  ఎందుకు భరించాలి?

బాయ్‌ఫ్రెండ్‌ ఎందుకు భరించాలి?

హీరోయిన్‌ కాబట్టి నాకు తప్పదు. కానీ, అతను (బాయ్‌ఫ్రెండ్‌) ఎందుకు మాటలు పడాలి?

హీరోయిన్‌ కాబట్టి నాకు తప్పదు. కానీ, అతను (బాయ్‌ఫ్రెండ్‌) ఎందుకు మాటలు పడాలి? ఎవరెవరో ఏదేదో అంటుంటే ఎందుకు భరించాలి? అంటున్నారు ఇలియానా. ప్రముఖ ఆస్ట్రేలియన్‌ ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్, ఇలియానా ఎప్పట్నుంచో డేటింగ్‌ (సహ జీవనం) చేస్తున్నారు. ఇద్దరూ కలసి షికార్లకు వెళతారు. ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. కానీ, బాయ్‌ఫ్రెండ్‌ గురించి ఇలియానా ఎప్పుడూ పబ్లిగ్గా మాట్లాడింది లేదు. ఎందుకలా? ఇలియానాను అడిగితే... ‘‘నటీనటులను ప్రేక్షకులు ఎంతగా ప్రేమిస్తారో ఒక్కోసారి అంతకు రెండింతలు ద్వేషిస్తారు. ఏ కారణం లేకుండానే తిడతారు.

ఏవేవో మాటలంటారు. కొన్నిసార్లు వాళ్ల మాటలు మరీ దారుణంగా ఉంటున్నాయి. 11 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా. ఇవన్నీ నాకు తెలుసు. నటిస్తున్నాను కాబట్టి నాకు తప్పదు. అతనూ మాటలు పడడం మంచిది కాదు. అందుకే, అతని గురించి పబ్లిగ్గా మాట్లాడను’’ అన్నారు. ఇలియానా మాట్లాడకున్నా జనాలు మాత్రం మాట్లాడుతూనే ఉంటారేమో!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement