నీకేదంటే ఇష్టం | where is venkata lakshmi released on march | Sakshi
Sakshi News home page

నీకేదంటే ఇష్టం

Jan 31 2019 2:24 AM | Updated on Jan 31 2019 2:24 AM

where is venkata lakshmi released on march - Sakshi

లక్ష్మీరాయ్‌

రామ్‌ కార్తీక్, పూజిత పొన్నాడ జంటగా లక్ష్మీరాయ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘వేర్‌ ఈజ్‌ వెంకటలక్ష్మి’. కిశోర్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. గురునాథ్‌రెడ్డి సమర్పణలో ఎం.శ్రీధర్‌రెడ్డి, హెచ్‌. ఆనంద్‌రెడ్డి, ఆర్కే రెడ్డి నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. హారర్‌ కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను మార్చిలో విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘ఆల్రెడీ రిలీజ్‌ చేసిన ఫస్ట్‌ లుక్, ‘పాపా నీకేదంటే ఇష్టం’ పాటకు మంచి స్పందన లభిస్తోంది. త్వరలోనే టీజర్‌ను రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రవీణ్, మధునందన్‌ల కామెడీ సినిమాకు హైలైట్‌గా ఉంటుంది. హరిగౌర మంచి సంగీతం అందించారు’’ అని చిత్రబృందం పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement