'నేనూ శ్రీమంతుడు చూశా.. చాలా బాగుంది' | watched srimanthudu, tweets ap cm chandra babu naidu | Sakshi
Sakshi News home page

'నేనూ శ్రీమంతుడు చూశా.. చాలా బాగుంది'

Sep 15 2015 2:48 PM | Updated on Aug 25 2018 6:37 PM

'నేనూ శ్రీమంతుడు చూశా.. చాలా బాగుంది' - Sakshi

'నేనూ శ్రీమంతుడు చూశా.. చాలా బాగుంది'

శ్రీమంతుడు సినిమా విడుదలై ఇప్పటికి దాదాపు ఆరు వారాలవుతోంది. ఇన్నాళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన బిజీ షెడ్యూల్లోంచి కాస్తంత తీరిక చేసుకుని ఆ సినిమా చూశారు.

శ్రీమంతుడు సినిమా విడుదలై ఇప్పటికి దాదాపు ఆరు వారాలవుతోంది. ఇన్నాళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన బిజీ షెడ్యూల్లోంచి కాస్తంత తీరిక చేసుకుని ఆ సినిమా చూశారు. సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలన్న సందేశంతో కూడిన ఆ సినిమా చాలా బాగుందని మెచ్చుకున్నారు.

ఆ సందేశం 'స్మార్ట్ విలేజ్ స్మార్ట్ వార్డ్'ను ప్రతిబింబిస్తోందంటూ ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించారు. దానికి సినిమా హీరో మహేశ్ బాబు కూడా సంతోషించాడు. సినిమా మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉందంటూ ట్విట్టర్లోనే సమాధానం ఇచ్చాడు. సినిమా చూసినందుకు థాంక్స్ కూడా చెప్పాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement