ప్రభాస్‌కో.. ఎన్టీఆర్‌కో ఇస్తే..! | Vjay Devarakonda Geetha Govindam Promotion | Sakshi
Sakshi News home page

Jun 21 2018 12:37 PM | Updated on Aug 3 2019 12:30 PM

Vjay Devarakonda Geetha Govindam Promotion - Sakshi

అర్జున్‌ రెడ్డి సినిమాతో సెన్సేషనల్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్‌ దేవరకొండ. ఈ యువ కథానాయకుడు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం గీత గోవిందం. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలను చిత్రయూనిట్ ఇటీవల ప్రారంభించారు. విజయ్‌ స్టైల్‌లో ట్వీటర్‌ వేదిక ఆసక్తికర కామెంట్స్‌తో సినిమా మీద హైప్‌ క్రియేట్‌ చేస్తున్నాడు విజయ్‌.

పరుశురామ్‌ దర‍్శకత్వంలో బన్నీవాసు నిర్మిస్తున్న ఈ సినిమాలో ఛలోఫేం రష్మిక మందన హీరోయిన్‌ గా నటిస్తున్నారు. తాజాగా ట్వీటర్‌లో హీరో హీరోయిన్ల మధ్య జరిగిన సంభాషణ హాట్‌ టాపిక్‌గా మారింది. రష్మిక.. ఫిలిం ఫేర్‌లో విజయ్‌కు ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చినందుకు గాను శుభాకాంక్షలు తెలిపారు.

రష్మిక : ఫిలిం ఫేర్ బెస్ట్‌ యాక్టర్‌ అంట కదా.. కంగ్రాచ్యులేషన్స్‌ గోవింద్
విజయ్‌ : మేడమ్‌.. గీతా మేడమ్‌.. మీతో  టైం గడపడమే నాకు నిజమైన అవార్డ్‌ మేడమ్‌. ఇవి వస్తుంటాయ్‌ పోతుంటాయ్‌.
రష్మిక : ఇగో గోవిందం, ఈ ఓవరాక్షనే తగ్గించుకోమన్నది. అసలు నీకు కాదు ప్రభాస్‌కో.. తారక్‌ కో ఇస్తే మాకు ఈ గొడవ పోయేది.
విజయ్ : అవార్డులో ఏముంది మేడమ్, మీలాంటి వాళ్లు నన్ను ప్రేమించడం చాలు. గీత మేడమ్‌.
రష్మిక: నా లాంటి వాళ్లా..? వాళ్లు ఏంటి? ఆ ప్లూరల్‌ ఏంటి? తెలుసులే నీ గురించి. ఒక్కరు సరిపోరు. ఎవర్నీ వదలవుగా. 
విజయ్ : మేడమ్‌.. నా ఉద్దేశం అది కాదు మేడమ్, ఒకసారి నన్ను 23న కలవండి మేడం. అన్నీ వివరిస్తా.

అంటూ సినిమాకు సంబంధించిన అప్‌ డేట్ 23న వస్తుందంటూ హిట్‌ ఇచ్చారు. విజయ్‌ దేవరకొం‍డ హీరోగా తెరకెక్కిన టాక్సీవాలా నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉండగా ఇప్పుడు గీత గోవిందం చిత్రం కూడా రిలీజ్‌కు రెడీ అవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement