విశాల్ సరసన ఇనియ | Vishal to romance 2 Heroines | Sakshi
Sakshi News home page

విశాల్ సరసన ఇనియ

Dec 24 2013 4:52 AM | Updated on Sep 2 2017 1:53 AM

విశాల్ సరసన ఇనియ

విశాల్ సరసన ఇనియ

యువ నటి ఇనియ నటుడు విశాల్‌తో రొమాన్స్‌కు సిద్ధం అవుతోంది. వాగైచూడవా చిత్రం ద్వారా తమిళ చిత్ర రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ ఆ చిత్రంలో

యువ నటి ఇనియ నటుడు విశాల్‌తో రొమాన్స్‌కు సిద్ధం అవుతోంది. వాగైచూడవా చిత్రం ద్వారా తమిళ చిత్ర రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ ఆ చిత్రంలో గ్రామీణ యువతిగా నటించి మంచి మార్కులే కొట్టేసింది. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించినా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు మాత్రం రాలేదు. తాజాగా అలాంటి మంచి అవకాశం వచ్చింది. పాండియనాడు వంటి సక్సెస్‌ఫుల్ చిత్రం తరువాత నటుడు విశాల్ నిర్మిస్తూ నటిస్తున్న చిత్రం నాన్ శిగప్పు మనిదన్. తిరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఒక హీరోయిన్‌గా లక్ష్మీ మీనన్ నటిస్తున్నారు. మరో ముఖ్యమైన పాత్రకు ఇనియను ఎంపిక చేశారు. ఇందులో ఆమెది చాలా క్రిటికల్ పాత్ర అట. కథకు కీలక పాత్ర కావడంతో రెండవ హీరోయిన్‌గా నటించడానికి అంగీకరించినట్లు ఇనియ పేర్కొంది. జనవరి నుంచి ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొననున్నట్లు ఆమె తెలిపింది.  

Advertisement
 
Advertisement
Advertisement