‘విల్లా’లో ఏం జరిగింది? | Villa (Pizza2) film release on Nov 14 | Sakshi
Sakshi News home page

‘విల్లా’లో ఏం జరిగింది?

Nov 1 2013 12:22 AM | Updated on Sep 2 2017 12:10 AM

తెలుగు, తమిళ భాషల్లో విజయవంతమైన ‘పిజ్జా’ చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కిన చిత్రం ‘విల్లా’(పిజ్జా-2). అశోక్ సెల్వన్, సంచిత శెట్టి జంటగా నటించిన ఈ చిత్రానికి దీపన్.ఆర్ దర్శకుడు.

తెలుగు, తమిళ భాషల్లో విజయవంతమైన ‘పిజ్జా’ చిత్రానికి కొనసాగింపుగా తెరకెక్కిన చిత్రం ‘విల్లా’(పిజ్జా-2). అశోక్ సెల్వన్, సంచిత శెట్టి జంటగా నటించిన ఈ చిత్రానికి దీపన్.ఆర్ దర్శకుడు. గుడ్ సినిమా గ్రూప్, స్టూడియో సౌత్ సంస్థలు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాయి. ఈ నెల 14న  ‘విల్లా’ విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన ఎస్.కె.ఎన్ మాట్లాడుతూ -‘‘పంపిణీదారుల్ని దృష్టిలో పెట్టుకొని మేం సినిమాను ఎంపిక చేస్తాం. అందుకే మా సంస్థ ద్వారా వచ్చిన ప్రతి సినిమా పంపిణీదారులకు లాభాలనే తెచ్చిపెట్టింది. ‘విల్లా’లో ఏం జరిగిందన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన ‘విల్లా’ పాటలు, ప్రచార చిత్రాలు మంచి స్పందన చూరగొంటున్నాయి. సినిమా కూడా తప్పకుండా విజయాన్ని అందుకుంటుందని నా నమ్మకం’’ అని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement