క్రేజ్‌కి తగ్గట్టుగా... | Vijay Deverakonda Taxiwala Worldwide Grand Release On May 18th | Sakshi
Sakshi News home page

క్రేజ్‌కి తగ్గట్టుగా...

Feb 24 2018 12:20 AM | Updated on Feb 24 2018 12:20 AM

Vijay Deverakonda Taxiwala Worldwide Grand Release On May 18th - Sakshi

విజయ్‌ దేవరకొండ

‘అర్జున్‌ రెడ్డి’ లాంటి సక్సెస్‌ఫుల్‌ సినిమా తర్వాత విజయ్‌ దేవరకొండ హీరోగా ప్రియాంక జవాల్కర్, మాళవికా నాయర్‌ హీరోయిన్లుగా నూతన దర్శుకుడు రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. జిఏ2, యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా ఎస్‌.కే.యన్‌ నిర్మాతగా పరిచయమవుతున్నారు.

ఈ సినిమాను మే 18న రిలీజ్‌ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘విజయ్‌ దేవరకొండకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా తన  క్యారెక్టర్‌ను డెవలప్‌ చేశాడు దర్శకుడు రాహుల్‌. బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాయి. సినిమా టీమ్‌ అంతా చాలా బాగా వర్క్‌ చేశారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. మే 18న గ్రాండ్‌గా రిలీజ్‌ చేయనున్నాం. ఈ సినిమాకు చక్కని టైటిల్, అలాగే  ఫస్ట్‌ లుక్‌ని త్వరలో విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: జేక్స్‌ బిజాయ్, కెమెరా: సుజిత్‌ సారంగ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement