మలయాళీ దర్శకుడితో వెంకీ | venkatesh to team up with Jeethu Joseph | Sakshi
Sakshi News home page

మలయాళీ దర్శకుడితో వెంకీ

Aug 30 2016 1:31 PM | Updated on Sep 4 2017 11:35 AM

మలయాళీ దర్శకుడితో వెంకీ

మలయాళీ దర్శకుడితో వెంకీ

బాబు బంగారం సినిమాతో మంచి కమర్షియల్ హిట్ అందుకున్న వెంకటేష్.. ఇప్పుడు వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. లాంగ్ గ్యాప్ తరువాత చేసిన బాబు బంగారం వెంకీకి మంచి కిక్ ఇచ్చింది. అదే జోరులో ఇప్పుడు ప్రయోగాలకు...

బాబు బంగారం సినిమాతో మంచి కమర్షియల్ హిట్ అందుకున్న వెంకటేష్.. ఇప్పుడు వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. లాంగ్ గ్యాప్ తరువాత చేసిన బాబు బంగారం వెంకీకి మంచి కిక్ ఇచ్చింది. అదే జోరులో ఇప్పుడు ప్రయోగాలకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం మాధవన్ హీరోగా తెరకెక్కిన ఇరుద్ది సుత్తుర్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న విక్టరీ హీరో, మరో సినిమాను కూడా రెడీ చేసే పనిలో ఉన్నాడు.

మళయాలి దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు వెంకీ. ఇప్పటికే జోసెఫ్ చెప్పిన కథకు ఓకె చెప్పిన వెంకీ, పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయాలని సూచించాడట. గతంలో జీతూ దర్శకత్వంలో తెరకెక్కిన దృశ్యం సినిమాను తెలుగులో శ్రీ ప్రియ దర్శకత్వంలో రీమేక్ చేశారు. థ్రిల్లర్ సినిమాల స్పెషలిస్ట్గా పేరున్న జీతూ జోసెఫ్, వెంకీ ఇమేజ్కు బాడీ లాంగ్వేజ్ తగ్గ కథను రెడీ చేసే పనిలో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement