పౌరాణిక పాత్రలో సీనియర్ హీరో..? | venkatesh as Hiranya kashyapa in guna sekhars next | Sakshi
Sakshi News home page

పౌరాణిక పాత్రలో సీనియర్ హీరో..?

Aug 27 2017 10:40 AM | Updated on Sep 17 2017 6:01 PM

పౌరాణిక పాత్రలో సీనియర్ హీరో..?

పౌరాణిక పాత్రలో సీనియర్ హీరో..?

రుద్రమదేవి సినిమాతో మంచి విజయం అందుకున్న క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్.

రుద్రమదేవి సినిమాతో మంచి విజయం అందుకున్న క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్.. ఇప్పుడు మరో భారీ చిత్రానికి రెడీ అవుతున్నాడు. రుద్రమదేవి తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న గుణ టీం, ఈ సారి ఓ పౌరాణిక గాథను తెరపై ఆవిష్కరించనున్నారు. భక్త ప్రహ్లాద కథను హిరణ్య కశ్యపుడి కోణంలో తెరకెక్కించనున్నట్టుగా ప్రకటించాడు గుణ శేఖర్. అయితే ప్రస్తుతం ఉన్న నటుల్లో హిరణ్య కశ్యపుడి పాత్రకు ఎవరు సూట్ అవుతారన్న చర్చ మొదలైంది.

ముందుగా యంగ్ హీరోలే ఈ పాత్రలో నటిస్తారన్న ప్రచారం జరిగినా.. తాజాగా ఓ సీనియర్ ను ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. ఇంత వరకు తన కెరీర్ లో పౌరాణిక పాత్రలో కనిపించని సీనియర్ హీరో వెంకటేష్, హిరణ్య కశ్యప సినిమాలో లీడ్ రోల్ లో నటించనున్నాడు. ఇటీవల ప్రయోగాత్మక చిత్రాలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్న వెంకటేష్, నెగెటివ్ టచ్ ఉన్న హిరణ్య కశ్యపుడి పాత్రలో నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. త్వరలోనే ఈ భారీ చిత్రానికి సంబంధించి మరిన్ని విషయాలు వెల్లడించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement