ఆసక్తిరేపుతోన్న ‘వెంకీమామ’ టైటిల్‌ లోగో

Venkatesh And Naga Chaitanya Venky Mama Title Logo Released - Sakshi

‘ఎఫ్‌2’తో ఫుల్‌ ఫామ్‌లోకి వచ్చిన విక్టరీ వెంకటేష్‌.. తాజాగా ‘వెంకీమామ’ షూటింగ్‌తో బిజీ అయ్యారు. నాగ చైతన్య, వెంకటేష్‌ కలిసి నటిస్తుండటంతో.. ఈ మూవీపై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. చాలా కాలంపాటు వాయిదాపడుతూ వచ్చిన ఈ మూవీ.. ప్రస్తుతం జెట్‌స్పీడ్‌లో షూటింగ్‌ జరుపుకుంటోంది.

ఉగాది సందర్భంగా ఈ మూవీ టైటిల్‌ లోగోను కాసేపటిక్రితమే విడుదల చేసింది చిత్రయూనిట్‌. రాశీ చక్రంలో.. వెంకీమామ టైటిల్‌ను ఆసక్తికరంగా డిజైన్‌చేశారు. పోస్టర్‌లో ఓ వైపు పల్లెటూరి వాతావరణం.. మరోవైపు యుద్దవాతావరణం కనిపిస్తోంది. ఇందులో వెంకటేశ్, నాగచైతన్య నిజజీవితంలో మాదిరిగానే మామాఅల్లుళ్లుగా నటించనున్నారు. సురేశ్‌ ప్రొడక్షన్స్, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకటేశ్‌ సరసన పాయల్‌ రాజ్‌పుత్, నాగచైతన్యకు జోడీగా రాశీఖన్నా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కేఎస్‌ రవీంద్ర (బాబి) దర్శకత్వం వహిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top