క్యూట్ పెయిర్‌తో స్వీట్ లవ్‌స్టోరీ | vasta nee venuka movie shooting Began | Sakshi
Sakshi News home page

క్యూట్ పెయిర్‌తో స్వీట్ లవ్‌స్టోరీ

Dec 12 2013 12:42 AM | Updated on Sep 2 2017 1:29 AM

క్యూట్ పెయిర్‌తో స్వీట్ లవ్‌స్టోరీ

క్యూట్ పెయిర్‌తో స్వీట్ లవ్‌స్టోరీ

‘‘పబ్లిసిటీ డిజైనింగ్ నుంచి వచ్చిన మా దర్శకుడు రమేష్ వర్మకు మంచి విజన్ ఉంది. ప్రేమకథలను తను చాలా అందంగా తెరకెక్కించగలడు. హవీష్

 ‘‘పబ్లిసిటీ డిజైనింగ్ నుంచి వచ్చిన మా దర్శకుడు రమేష్ వర్మకు మంచి విజన్ ఉంది. ప్రేమకథలను తను చాలా అందంగా తెరకెక్కించగలడు. హవీష్, ఇషాలాంటి క్యూట్ పెయిర్‌తో చేస్తున్న లవ్‌స్టోరీ ఇది. జనవరి మూడోవారంలో యూరప్‌లో చిత్రీకరణ మొదలుపెడతాం’’ అని నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ తెలిపారు. హవీష్, ఇషా జంటగా రమేష్‌వర్మ దర్శకత్వంలో ఆయన నిర్మిస్తోన్న ‘వస్తా నీ వెనక’ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో మొదలైంది.
 
  ముహూర్తపు దృశ్యానికి డి.రామానాయుడు కెమెరా స్విచాన్ చేయగా, దాసరి నారాయణరావు క్లాప్ ఇచ్చారు. బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా రమేష్‌వర్మ మాట్లాడుతూ -‘‘రైడ్, వీర తర్వాత నేను చేస్తున్న సినిమా ఇది. సంగీతానికి అధిక ప్రాధాన్యం ఉంటుంది’’ అని చెప్పారు. కథ తనను అమితంగా ఆకట్టుకుందని ఇషా అన్నారు. బద్రినాథ్, జీనియస్ తర్వాత తాను చేస్తున్న సినిమా ఇదని రచయిత విస్సు చెప్పారు. ముక్కోణ ప్రేమకథ ఇదని హవీష్ పేర్కొన్నారు. బ్రహ్మానందం, అలీ, రాజా రవీంద్ర, విస్సు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: విజయ్ కె.చక్రవర్తి, స్క్రిప్ట్ కో ఆర్డినేటర్: పాత్రికేయ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: మురళీకృష్ణ.
 

Advertisement
 
Advertisement
Advertisement