అహం బ్రహ్మస్మి

Varun Tej's New Movie Titled As Aham Brahmasmi  - Sakshi

... అంటే నేనే బ్రహ్మ అని అర్థం. క్రిష్‌ ఇలానే అంటున్నారు. ‘అహం బ్రహ్మసి’ టైటిల్‌తో ఓ సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం వీరనారి రాణీ లక్ష్మీభాయ్‌ జీవితం ఆధారంగా ఆయన ‘మణికర్ణిక’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో లక్ష్మీభాయ్‌గా  కంగనా రనౌత్‌ నటిస్తున్నారు. ఈ హిస్టారికల్‌ మూవీని తెరకెక్కి స్తూనే తన నెక్ట్స్‌ సినిమా ‘అహం బ్రహ్మస్మి’కు సంబంధించిన ప్రీ–ప్రొడక్షన్‌ పనులను మొదలుపెట్టారు క్రిష్‌. ఇదొక హై బడ్జెట్‌ కమర్షియల్‌ మూవీ అని సమాచారం.

ఒక్క ‘వేదం’ మినహా క్రిష్‌ తెరకెక్కించిన ఫస్ట్‌ మూవీ ‘గమ్యం’ నుంచి ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ వరకు అన్ని సినిమాలనూ నిర్మించిన సాయిబాబు జాగర్లముడి, రాజీవ్‌ రెడ్డి ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇందులో ఒక టాప్‌ హీరోను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు క్రిష్‌.  ‘‘ఫుల్‌ టెక్నికల్‌ వేల్యూస్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నాం. హీరో ఫైనలైజ్‌ అయిన తర్వాత మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియజేస్తాం. ఆగస్టులో ఈ సినిమాను ప్రారంభించబోతున్నాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top