పెళ్లికి తయార్‌ | Varun Dhawan And Sara Ali Khan's New Pic of Coolie No 1 | Sakshi
Sakshi News home page

పెళ్లికి తయార్‌

Jan 4 2020 1:37 AM | Updated on Jan 4 2020 1:37 AM

Varun Dhawan And Sara Ali Khan's New Pic of Coolie No 1  - Sakshi

వరుణ్‌ ధావన్, సారా అలీ ఖాన్‌

ఇక్కడున్న ఫొటో చూశారుగా.. వధూవరులుగా వరుణ్‌ ధావన్, సారా అలీఖాన్‌ ఎలా మెరిసిపోతున్నారో! ఈ ఫొటో చూసి వరుణ్‌ ధావన్‌ ప్రేయసి నటాషా దలాల్‌ ఏమీ అనలేదా? అంటే ఏమి అనలేదట. ఎందుకంటే ఈ ఫొటో ‘కూలీ నెం1’ చిత్రంలోనిది. 1995లో డేవిడ్‌ ధావన్‌ దర్శకత్వంలో గోవిందా, కరిష్మా కపూర్‌ జంటగా నటించిన చిత్రం ‘కూలీ నెం1’. అదే పేరుతో ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు డేవిడ్‌ ధావన్‌. ఇందులో వరుణ్‌ ధావన్, సారా అలీఖాన్‌ జంటగా నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా కొత్త పోస్టర్‌ వైరల్‌ అవుతోంది. సినిమాలోని ఓ సీన్‌లో భాగంగా వరుణ్, సారా పెళ్లికి తయారైన గెటప్స్‌లో కనిపిస్తారు. ఈ  చిత్రాన్ని మే 1న విడుదల చేయాలనుకుంటున్నారు. ఇలా ఆన్‌ స్క్రీన్‌ పెళ్లి సీన్‌లో నటించిన వరుణ్‌ ఆఫ్‌ స్క్రీన్‌ నటాషాతో పెళ్లికి రెడీ అవుతున్నారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement