మహేష్‌ 25 టైటిల్‌పై డైరెక్టర్‌ క్లారిటీ..! | Vamsi Paidipally clarifies Mahesh25 title | Sakshi
Sakshi News home page

మహేష్‌ 25 టైటిల్‌పై డైరెక్టర్‌ క్లారిటీ..!

Oct 28 2017 2:15 PM | Updated on Oct 28 2017 5:01 PM

Vamsi Paidipally clarifies Mahesh25 title

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు తన 25వ సినిమాను వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్నట్టుగా చాలా కాలం కిందటే ప్రకటించారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మహేష్‌ 24వ సినిమాలో నటిస్తుండగా వంశీ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం దర్శకుడు వంశీ పైడిపల్లి, సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌లో విదేశాల్లో సంగీత చర్చల్లో ఉన్నారు. దిల్‌ రాజు, అశ్వనిదత్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్స్‌ ఇవే అంటూ కొన్ని పేర్లు తెర మీదకు వచ్చాయి.

కొద్ది రోజులుగా మహేష్‌25 టైటిల్స్‌ అంటూ ‘కృష్ణా ముకుందా మురారీ’, ‘హరే రామ హరే కృష్ణ’ అనే టైటిల్స్‌ ప్రముఖంగా వినిపించాయి. ఈ టైటిల్స్‌ మహేష్‌ బాబు ఇమేజ్‌కు దిల్‌రాజు బ్యానర్‌ కు తగ్గట్టుగా ఉండటంతో దాదాపు ఈ టైటిల్స్‌ ఒకటి ఫిక్స్‌ చేస్తారని భావించారు. అయితే ఈ విషయంపై స్పందించిన దర్శకుడు వంశీ పైడిపల్లి మహేష్‌ 25కి ఇంతవరకు టైటిల్‌ ఫిక్స్‌ చేయలేదని ప్రకటించారు. టైటిల్‌ నిర్ణయించిన తరువాత అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement