వామ్మో...భయపెడతారట | Vammo Movie Launched | Sakshi
Sakshi News home page

వామ్మో...భయపెడతారట

Dec 8 2014 11:27 PM | Updated on Sep 2 2017 5:50 PM

వామ్మో...భయపెడతారట

వామ్మో...భయపెడతారట

సీనియర్ దర్శకుడు సాగర్ దర్శకత్వంలో శ్రీనివాసరెడ్డి, జస్వంత్ హీరోలుగా జస్ముహూర్తపు

 సీనియర్ దర్శకుడు సాగర్ దర్శకత్వంలో శ్రీనివాసరెడ్డి, జస్వంత్ హీరోలుగా జస్వంత్ నిర్మిస్తున్న ‘వామ్మో’ చిత్రం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి ఎస్.గోపాల్‌రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, బ్రహ్మానందం క్లాప్ ఇచ్చారు. తమ్మారెడ్డి భరద్వాజ్ గౌరవ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకూ తాను తీసిన 30 సినిమాల్లోకెల్లా విభిన్నంగా ఉండే సినిమా ఇదేననీ, వినోదంతో పాటు ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉండే హారర్ చిత్రమిదనీ సాగర్ చెప్పారు.

కమెడియన్‌గా చేస్తూనే మంచి అవకాశం వస్తే.. హీరోగా నటిస్తున్నాననీ, సాగర్ లాంటి మంచి దర్శకునితో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాననీ శ్రీనివాసరెడ్డి అన్నారు. జనవరిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, మే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. బ్రహ్మానందం, సుధీర్, శ్రీను, మహేశ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వి.శ్రీనివాసరెడ్డి, కూర్పు: వి.నాగిరెడ్డి, సంగీతం: కీరవాణి, కోటి, మణిశర్మ, దేవిశ్రీప్రసాద్, నేపథ్య సంగీతం: సాయికార్తీక్.
 

Advertisement
 
Advertisement
Advertisement