ప్రముఖ వ్యాఖ్యాత, నటి ఉదయభాను ప్రధాన పాత్రధారిణిగా రూపొందుతోన్న చిత్రం ‘మధుమతి’. రాజ్‌శ్రీధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కె.రాణి శ్రీధర్, రమేశ్‌బాబు నిర్మాతలు.
ప్రముఖ వ్యాఖ్యాత, నటి ఉదయభాను ప్రధాన పాత్రధారిణిగా రూపొందుతోన్న చిత్రం ‘మధుమతి’. రాజ్‌శ్రీధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కె.రాణి శ్రీధర్, రమేశ్‌బాబు నిర్మాతలు. రాజ్‌కిరణ్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. కుంచె రఘు ఆడియోసీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని ఐఏఎస్ అధికారి ఎన్.గోపాలకృష్ణకు అందించారు. ప్రచార చిత్రాలను మరో ఐఏఎస్ అధికారి కామాక్షి విడుదల చేశారు. సినిమా విజయం సాధించాలని అతిథులందరూ ఆకాంక్షించారు.

