పండగ చేసుకున్న మహేశ్ అభిమానులు | twitter fans say srimanthudu a classic hit | Sakshi
Sakshi News home page

పండగ చేసుకున్న మహేశ్ అభిమానులు

Aug 7 2015 8:44 AM | Updated on Aug 25 2018 6:37 PM

భీమవరంలో మహేశ్ అభిమానుల బైకు ర్యాలీ - Sakshi

భీమవరంలో మహేశ్ అభిమానుల బైకు ర్యాలీ

లుంగీ పైకి కట్టుకుని చెప్పులు వేసుకుని అలా మహేశ్ బాబు నడిచి వస్తుంటే.. థియేటర్లో విజిళ్ల మోతే మోత. సైకిల్ తొక్కుకుంటూ స్టైలుగా వెళ్తుంటే.. చప్పట్ల గోల.

లుంగీ పైకి కట్టుకుని చెప్పులు వేసుకుని అలా మహేశ్ బాబు నడిచి వస్తుంటే.. థియేటర్లో విజిళ్ల మోతే మోత. సైకిల్ తొక్కుకుంటూ స్టైలుగా వెళ్తుంటే.. చప్పట్ల గోల. శ్రుతిహాసన్తో పాట వచ్చినప్పుడల్లా అభిమానుల కేరింత.. స్థూలంగా ఇదీ శుక్రవారం తెల్లవారుజామున ప్రీమియర్ షోల సందర్భంగా థియేటర్లలో పరిస్థితి. ఇక ట్విట్టర్ కూడా శ్రీమంతుడు హ్యాష్ ట్యాగ్లతో తెగ కూతలు పెడుతోంది.

శ్రీమంతుడు సినిమా బంపర్ హిట్ అయిందని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిందని, సినిమా వంద కోట్ల వసూళ్లు చేయడం ఖాయమని అభిమానులు చెబుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో అయితే తెల్లవారుజామునే అభిమానులు బైకులతో ర్యాలీ చేశారు. శ్రీమంతుడు సినిమా డిస్ట్రిబ్యూటర్లు అందరినీ శ్రీమంతులుగా చేస్తుందని ఓ అభిమాని పేర్కొన్నారు. ఫస్టాఫ్ ఓ మాదిరిగా ఉన్నా.. సెకండాఫ్లో మాత్రం మహేశ్ చించేశాడని చెబుతున్నారు. చిత్ర దర్శకుడు కొరటాల శివకు అందరూ ఏకగ్రీవంగా సలాం చెప్పేశారు. కొంతమంది అభిమానులు ఏమంటున్నారో వాళ్ల ట్వీట్లలోనే చూడండి...

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement