'పెళ్లిరోజున ఆయన ఇచ్చినదేమిటో తెలుసా'

'పెళ్లిరోజున ఆయన ఇచ్చినదేమిటో తెలుసా' - Sakshi


ముంబై: 'పెళ్లిరోజున మీ ఆయన మీకేం ఇచ్చారు? హా..! ఇచ్చారు ఓ బిత్తరచూపు'.. 'పెళ్లిరోజున మీ ఆయన ఏమైనా ఇచ్చారా? ఔను! తలనొప్పి ఇచ్చారు'.. ఇవీ ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్‌, ప్రస్తుత వ్యాపారవేత్త, యాక్షన్ స్టార్‌ అక్షయ్‌కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా సంధించిన జోక్స్‌. ఈ బాలీవుడ్ దంపతులు ఆదివారం 15వ పెళ్లిరోజు వేడుకను జరుపుకొన్నారు.తమ పెళ్లిరోజు గురించి భావోద్వేగానికి గురవుతూ.. ఇప్పటికీ ట్వింకిల్ ఖన్నా నుంచి చూపు మరల్చుకోలేకపోతున్నట్టు వెల్లడిస్తూ.. అక్షయ్‌కుమార్ ఓ పాత ఫొటోను ట్విట్టర్‌లో పంచుకోగా..ట్వింకిల్ ఖన్నా మాత్రం కాస్తా సరదాగా స్పందించారు. పెళ్లిరోజు గురించి సరదా జోక్స్‌ ట్వీట్‌ చేశారు. ఆ తర్వాత తాము ఆనందంగా ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ.. తమ 15 ఏళ్ల వైవాహిక జీవితంలో అక్షయ్‌ ఇలాంటి సంతోషకరమైన క్షణాలెన్నింటినో అందించారని పేర్కొన్నారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top