టాప్‌ హీరోయిన్‌పై క్రిమినల్‌ కేసు | Trouble for Shraddha in cheating case | Sakshi
Sakshi News home page

టాప్‌ హీరోయిన్‌పై క్రిమినల్‌ కేసు

Dec 27 2017 5:35 PM | Updated on Dec 27 2017 5:39 PM

Trouble for Shraddha in cheating case - Sakshi

సాక్షి, ముంబై : ప్రముఖ బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌పై క్రిమినల్‌ కేసు నమోదైంది. గత రెండు నెలల క్రితం విడుదలైన హసీనా పార్కర్‌ అనే చిత్రంలో శ్రద్ధా ప్రధాన పాత్ర పోషించింది. ముంబై అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్‌ జీవితాధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. అయితే ఈ సినిమాలో శ్రద్ధ కపూర్‌ ధరించిన దుస్తుల విషయంలో ముంబైలో క్రిమినల్‌ కేసు నమోదైంది. ఓ ప్రముఖ కంపెనీ శ్రద్ధకు దుస్తులు డిజైన్‌ చేసింది.

ఒప్పందం ప్రకారం సదరు కంపెనీ పేరును సినిమాలో వేస్తామని నిర్మాత నహిత్‌ ఖాన్‌ మాటిచ్చారు. కానీ  సినిమా మెత్తంలో ఎక్కడా కంపెనీ పేరు వేయలేదు. దీంతో కంపెనీ యాజమాన్యం, నిర్మాత నహిత్‌ ఖాన్‌ , శ్రద్ధా కపూర్‌పై ముంబై లోని అంధేరీ మెట్రలోపాలిటన్‌​ కోర్టులో పిటీషన్‌ వేసింది. కోర్టు ఆదేశాల మేరకు నహిత్‌ ఖాన్‌, శ్రద్ధా కపూర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసిన తర్వాత అసలు విషయం ఏంటనేది వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. శ్రద్ధా కపూర్‌ ప్రధాన పాత్ర పోషించిన ఈచిత్రంలో అంకూర్‌ భాటియా, రాజేష్‌ తైలాంగ్‌లు కీలక పాత్రల్లో నటించారు. గత సెప్టెంబర్‌ 22న ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement