రెండొందల ఏళ్ల బంగ్లాలో... | Sakshi
Sakshi News home page

రెండొందల ఏళ్ల బంగ్లాలో...

Published Mon, Nov 6 2017 1:51 AM

Trisha shoots for Paramapadham Vilayattu at this 200-year-old monument - Sakshi

ఉన్నాయా? ఇంకా! ‘రెండొందల ఏళ్ల క్రితం కట్టిన బంగ్లాలు’ అనే డౌటొచ్చిందా? అటువంటి డౌట్స్‌ అస్సలు పెట్టుకోవద్దు. కొన్ని ఉన్నాయి! తమిళనాడులోని యార్కాడ్‌లో ఒకటుంది. కొన్ని రోజులుగా అప్పుడప్పుడూ త్రిష అక్కడే ఉంటున్నారు. అదీ సిన్మా కోసమే! ‘పరమపథమ్‌ విలయాట్టు’ అనే తమిళ థ్రిల్లర్‌లో త్రిష నటిస్తున్నారు. ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలను రెండొందల ఏళ్ల పాత బంగ్లాలో తీస్తున్నారు. ఆ బంగ్లాకు ఓ స్పెషాలిటీ ఉంది. అదేంటంటే... ఒకప్పుడు అందులో మొఘల్‌ కింగ్‌ ఔరంగజేబు ఉండేవారట! ఇప్పుడు కుర్రాళ్ల జేబు వెనుక స్థానంలో (గుండెల్లో) కొలువున్న త్రిష ఉంటున్నారన్న మాట! యాక్చువల్‌గా ఈ సిన్మా షూటింగ్‌ చాలా రోజుల తర్వాత మొదలుకావల్సింది. విక్రమ్‌ ‘సామి–2’ నుంచి త్రిష తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ డేట్స్‌ని త్రిష ఈ సిన్మాకి అడ్జస్ట్‌ చేశారు. 3 నెలల్లో సినిమాను చకచకా తీసేయాలనుకుంటున్నారట!!

Advertisement

తప్పక చదవండి

Advertisement