మంచి దూకుడు మీదున్న త్రిష! | Trisha Is In More Swing In Kollywood | Sakshi
Sakshi News home page

Jan 17 2019 9:34 PM | Updated on Jan 17 2019 9:34 PM

Trisha Is In More Swing In Kollywood - Sakshi

‘96’ సినిమాకు తమిళనాట ఊహించని విజయం దక్కింది. ఈ మూవీలో డీసెంట్‌ లుక్‌లో కనబడిన త్రిషకు మంచి మార్కులు పడ్డాయి. చాలాకాలంపాటు సరైన హిట్‌ కోసం ఎదురుచూసిన త్రిషకు సూపర్‌ హిట్‌ సినిమా దొరికింది. దీంతో తన హవా మళ్లీ మొదలైంది. 

అంతలోపే తలైవా రజనీ కాంత్‌ ‘పేట’లో కూడా అవకావం లభించింది. ఈ చిత్రం కూడా తమిళనాట మంచి విజయాన్ని సొంతం చేసుకుని వంద కోట్ల క్లబ్‌లోకి దూసుకుపోయింది. ఈ సినిమా కూడా సక్సెస్‌ కావడంతో త్రిషకు ఆఫర్స్‌ వెల్లువెత్తుతున్నాయట. ఇప్పటికే ఐదారు సినిమాలతో బిజీగా ఉన్న త్రిషకు.. చాలా కథలు వినిపించారట దర్శక నిర్మాతలు. ఇక ఈ ఏడాది త్రిష డైరీ కూడా ఫుల్‌ కానుందని సమాచారం. సీనియర్‌ హీరోయిన్స్‌ అందరిలోకెల్లా త్రిష మాత్రమే ప్రస్తుతం ఇంత బిజీగా ఉన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement