యూత్ అంటే బూతు కాదు | 'Top Rankers' Movie Ready for Release | Sakshi
Sakshi News home page

యూత్ అంటే బూతు కాదు

Feb 16 2014 12:16 AM | Updated on Sep 2 2017 3:44 AM

యూత్ అంటే బూతు కాదు

యూత్ అంటే బూతు కాదు

వైవిధ్యభరితమైన పాత్రలను చేయడానికి ఎప్పుడూ ముందుంటారు డా.రాజేంద్రప్రసాద్. పాత్రలో పూర్తిగా ఒదిగిపోవడానికి తన ఆహార్యాన్ని, శారీరక భాషను మార్చుకుంటారు.

వైవిధ్యభరితమైన పాత్రలను చేయడానికి ఎప్పుడూ ముందుంటారు డా.రాజేంద్రప్రసాద్. పాత్రలో పూర్తిగా ఒదిగిపోవడానికి తన ఆహార్యాన్ని, శారీరక భాషను మార్చుకుంటారు. అందుకు నిదర్శనంగా మేడమ్, ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి.. ఇలా పలు చిత్రాలను చెప్పుకోవచ్చు. త్వరలో ‘టాప్ ర్యాంకర్స్’ చిత్రంలో రాజేంద్రప్రసాద్ ఓ వినూత్నమైన లుక్‌లో కనిపించబోతున్నారు. విశ్వవిజన్ ఫిలింస్ పతాకంపై కేవీకే రావ్ సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ సమర్పణలో పసుపులేటి బ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మించారు. గోళ్లపాటి నాగేశ్వరరావు దర్శకుడు. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘విద్యార్థులు, విద్యా సంస్థలు, తల్లిదండ్రులు .. ఈ ముగ్గురి చుట్టూ తిరిగే కథ ఇది.  తెలుగు పరిశ్రమలో ఇప్పటివరకు రాని ఓ కొత్త కథతో ఈ సినిమా చేశాం. యూత్ అంతే బూతు కాదని చెప్పే చిత్రం. జయసూర్య స్వరపరచిన ఈ చిత్రం పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. సినిమా కూడా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement