Top Rankers
-
JEE Main Result 2025: టాప్ ర్యాంకర్లు వీరే
జాయింట్ ఎంటన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2025 ఫలితాలు శుక్రవారం అర్థరాత్రి విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా ఈసారి రెండు విడతల్లో కలిపి 24 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించి సత్తా చాటారు. వీరిలో నలుగురు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉండడం విశేషం. రాజస్థాన్ నుంచి అత్యధికంగా ఏడుగురు 100 పర్సంటైల్ సాధించారు. తెలంగాణ (3), మహారాష్ట్ర (3), ఉత్తరప్రదేశ్(3) ఇద్దరు పశ్చిమ బెంగాల్, గుజరాత్ (2), ఢిల్లీ(2), ఏపీ (1), కర్ణాటక (1) తర్వాతి స్థానాల్లో ఉన్నాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) వెల్లడించింది.రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఎండీ అనాస్, ఆయుష్ సింఘాల్ (Ayush Singhal) మొదటి రెండు ర్యాంకులు కైవసం చేసుకున్నారు. 100 పర్సంటైల్ సాధించిన వారిలో ఇద్దరు మాత్రమే బాలికలు ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన దేవదత్త మాఝీ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాయి మనోజ్ఞ గుత్తికొండ (Sai Manogna Guthikonda) మాత్రమే టాపర్లలో చోటు సంపాదించారు. మెయిన్ ఫలితంతో పాటు, అడ్వాన్స్డ్ 2025 కటాఫ్ మార్కులు, ఆలిండియా ర్యాంక్ లిస్ట్, రాష్ట్రాల వారీగా టాపర్ల జాబితాను కూడా ఎన్టీఏ విడుదల చేసింది. వివిధ కారణాలతో 110 మంది అభ్యర్థుల ఫలితాలను నిలిపివేసింది.100 పర్సంటైల్ సాధించిన విద్యార్థులు1. ఎండీ అనాస్ - రాజస్థాన్2. ఆయుష్ సింఘాల్ - రాజస్థాన్3. ఆర్కిస్మాన్ నంది - పశ్చిమ బెంగాల్4. దేవదత్త మాఝీ - పశ్చిమ బెంగాల్5. ఆయుష్ రవి చౌదరి - మహారాష్ట్ర6. లక్ష్య శర్మ - రాజస్థాన్7. కుశాగ్ర గుప్త - కర్ణాటక8. హర్ష్ ఎ గుప్తా - తెలంగాణ9. ఆదిత్ ప్రకాష్ భగడే - గుజరాత్10. దక్ష్ - ఢిల్లీ11. హర్ష్ ఝా - ఢిల్లీ12. రజిత్ గుప్తా - రాజస్థాన్13. శ్రేయాస్ లోహియా - ఉత్తరప్రదేశ్14. సాక్షం జిందాల్ - రాజస్థాన్15. సౌరవ్ - ఉత్తరప్రదేశ్16. వంగాల అజయ్ రెడ్డి - తెలంగాణ17. సానిధ్య సరాఫ్ - మహారాష్ట్ర18. విశాద్ జైన్ - మహారాష్ట్ర19. అర్నవ్ సింగ్ - రాజస్థాన్20. శివన్ వికాస్ తోష్నివాల్ - గుజరాత్21. కుశాగ్రా బైంగహా - ఉత్తరప్రదేశ్22. సాయి మనోజ్ఞ గుత్తికొండ - ఆంధ్రప్రదేశ్23. ఓం ప్రకాష్ బెహెరా - రాజస్థాన్24. బని బ్రతా మాజీ - తెలంగాణఅడ్వాన్స్డ్కు 2.50 లక్షల మందిదేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ రెండో సెషన్‌ను ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో నిర్వహించారు. 10,61,849 మంది ఈ పరీక్షకు రిజిస్టర్ చేసుకోగా, 9,92,350 మంది పరీక్షకు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి 2 లక్షల మంది ఈ పరీక్షరాశారు. జేఈఈ మెయిన్ (JEE Main) మొదటి, రెండో విడత పరీక్ష ఫలితాల ఆధారంగా 2.50 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎంపికయ్యారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఏప్రిల్ 23 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 2న పరీక్ష ఉంటుంది.జేఈఈ మెయిన్ రెండో సెషన్దరఖాస్తులు: 10,61,849 పరీక్ష రాసిన వారు: 9,92,350 జనరల్: 372,675ఓబీసీ: 374,860ఈడబ్ల్యూఎస్: 112,790ఎస్సీ: 97,887ఎస్టీ: 34,138 -
‘నీట్’ అమ్మాయిల్లో టాపర్ మాధురీ
అమ్మాయిలే టాప్... 7,97,042 మంది విద్యార్థులు నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 56.27గా నమోదైంది. ఉత్తీర్ణులైన వారిలో అత్యధికం అమ్మాయిలే. ఈసారి జనరల్ విభాగంలో కటాఫ్ మార్కు 134. టాప్ 50లో నాలుగు... తెలుగు విద్యార్థుల్లో మాధురీరెడ్డి తరువాత ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఖురేషి అస్రా.. 16వ ర్యాంకు, పిల్లి భాను శివతేజ.. 40వ ర్యాంకు, సోడం శ్రీనందన్‌రెడ్డి.. 42 ర్యాంకు సాధించారు. సాక్షి, హైదరాబాద్: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)లో తెలంగాణ బిడ్డ మాధురీరెడ్డి దేశవ్యాప్తంగా ఏడో ర్యాంకు సాధించగా, అమ్మాయిల విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది. జాతీయస్థాయి టాపర్‌గా రాజస్తాన్‌కు చెందిన నలిన్ ఖండేల్వాల్ 720 మార్కులకుగాను... 701 మార్కులతో మొదటి ర్యాంకు సాధించగా, 695 మార్కులు సాధించి తెలంగాణ విద్యార్థిని జి.మాధురీరెడ్డి ఏడో ర్యాంకులో మెరిసింది. టాప్ 50 ర్యాంకులు సాధించిన విద్యార్థుల మధ్య మార్కుల తేడా 16 మాత్రమే ఉండటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఖురేషి అస్రా.. 16వ ర్యాంకు, పిల్లి భాను శివతేజ.. 40, సోడం శ్రీనందన్‌రెడ్డి.. 42వ ర్యాంకు సాధించారు. గతేడాది కంటే పేపర్ సులువుగా రావడంతో కటాఫ్ మార్కు కూడా పెరిగింది. గతేడాది జనరల్ విభాగంలో కటాఫ్ మార్కు 107 కాగా, ఈసారి 134కు పెరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్–2019 ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. మే 5న దేశవ్యాప్తంగా 154 నగరాల్లో 2,546 కేంద్రాల్లో నీట్ పరీక్ష నిర్వహించారు. 15,19,375 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 14,10,754 మంది పరీక్షకు హాజరయ్యారు. ఒడిశాలో ఫొని తుపాను, కర్ణాటకలో రైలు ఆలస్యం కారణంగా అక్కడి అభ్యర్థుల కోసం గత నెల 20న మరోసారి పరీక్ష నిర్వహించారు. దీంతో ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయన్న సందేహాలు నెలకొన్నప్పటికీ... ముందుగా పేర్కొన్నట్లుగానే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఫలితాలు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 7,97,042 మంది విద్యార్థులు నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. మొత్తం ఉత్తీర్ణతా శాతం 56.27గా నమోదైంది. ఉత్తీర్ణులైన వారిలో అత్యధికంగా అమ్మాయిలే ఉన్నారు. 4,45,761 మంది అమ్మాయిలు, 3,51,278 మంది అబ్బాయిలు అర్హత సాధించారు. ఇక ఏపీలో 70.72 శాతంతో 39,039 మంది, తెలంగాణలో 67.44 శాతంతో 33,044 మంది విద్యార్థులు అర్హత సాధించారు. మొత్తం 11 భాషల్లో పరీక్ష నిర్వహించారు. తెలుగు భాషలో రాయడానికి 1796 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మే 29న నీట్ ప్రిలిమినరీ ‘కీ’ని ఎన్టీఏ విడుదల చేసింది. జూన్ 1 వరకు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం తుది ‘కీ’ఫలితాలను వెల్లడించింది. 15 శాతం సీట్లకు అఖిల భారత కౌన్సిలింగ్... నీట్ పరీక్షలో జనరల్ కేటగిరి అభ్యర్థులకు కనీస అర్హత మార్కులను 50 పర్సంటైల్‌గా, ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు 40 పర్సంటైల్‌గా, దివ్యాంగులకు 45 పర్సంటైల్‌గా నిర్ణయించారు. సీట్ల కేటాయింపులో ఎస్సీ అభ్యర్థులకు 15 శాతం, ఎస్టీ అభ్యర్థులకు 7.5 శాతం, ఓబీసీ అభ్యర్థులకు 27 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. నీట్–2019 ద్వారా అఖిల భారత కోటా సీట్లు, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సీట్లు, డీమ్డ్ యూనివర్సిటీలు, కేంద్ర సంస్థలు అన్నింటిలోనూ ఈ ర్యాంకుల ఆధారంగానే కేటాయిస్తారు. ఎయిమ్స్, పాండిచ్చేరిలోని జిప్మర్ మినహా అన్నింటిలో ఎంబీబీఎస్ ప్రవేశాలకు నీట్ ర్యాంకుల ద్వారానే భర్తీ చేస్తారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 15 శాతం సీట్లను నేషనల్ పూల్‌లోకి తీసుకున్నారు. వాటన్నింటినీ అఖిల భారత కౌన్సిలింగ్లో భర్తీ చేస్తారు. నీట్ ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రాల వారీగా మెరిట్ జాబితా రూపొందించి ప్రవేశాలు కల్పిస్తారు. నీట్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థుల మెరిట్ జాబితాను ‘మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్’ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్‌తో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూపొందిస్తాయి. నీట్ మెడికల్ మెరిట్ లిస్ట్ ఆధారంగానే ప్రవేశాల ప్రక్రియ జరుగుతుంది. విద్యార్థులు 15 శాతం అఖిల భారత సీట్లకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలకు ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎంసీసీ.ఎన్ఐసీ.ఇన్’వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఎన్టీఏ సూచించింది. ఇక రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఎంబీబీఎస్‌లో ప్రవేశాలకు సంబంధించి ఆయా రాష్ట్రాలు ప్రత్యేకంగా నోటిఫికేషన్లు జారీచేస్తాయి. అందుకోసం రాష్ట్రస్థాయి నీట్ ర్యాంకులను ప్రకటిస్తారు. వాటి ఆధారంగా కన్వీనర్, మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ, మైనారిటీ సీట్లను భర్తీ చేస్తారు. తుది ‘కీ’తో దక్షిణాది విద్యార్థులకు అన్యాయం! మే 29న నీట్ ప్రిలిమినరీ ‘కీ’ని ఎన్టీఏ విడుదల చేసింది. జూన్ 1 వరకు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది. అనంతరం బుధవారం ఫలితాలతోపాటు తుది ‘కీ’ని విడుదల చేసింది. దీనిపై తెలంగాణకు చెందిన విద్యా నిపుణులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మొదట విడుదల చేసిన ప్రాథమిక ‘కీ’కెమిస్ట్రీలో రెండు, ఫిజిక్స్‌లో రెండు ప్రశ్నలకు ఇచ్చిన జవాబులను తుది ‘కీ’లో మార్చినట్లు శ్రీచైతన్య కూకట్పల్లి జూనియర్ కాలేజీ డీన్ శంకర్రావు చెప్పారు. మొదటి ‘కీ’లో ఇచ్చిన జవాబులు సరైనవని, వాటినే మన విద్యార్థులు రాశారని ఆయన అన్నారు. తుది ‘కీ’లో వీటిని మార్చడంతో దక్షిణాది విద్యార్థులకు అన్యాయం జరిగిందన్నారు. ప్రాథమిక ‘కీ’లో వచ్చిన మార్కులు తుది ‘కీ’లో పోయాయన్నారు. అలా రెండు ప్రశ్నలకు కలిపి 8 మార్కులు, వాటికి మైనస్ మార్కులతో కలిపి 10 మార్కులు కోల్పోయినట్లు ఆయన విశ్లేషించారు. దీంతో ర్యాంకుల్లో భారీ తేడా వచ్చిందన్నారు. ఉత్తరాది వారు రాసిన దానికి అనుగుణంగా ఇలా జరిగిందన్న భావన విద్యార్థుల్లో నెలకొందన్నారు. దీంతో గతేడాది జాతీయస్థాయి 10 ర్యాంకుల్లో తెలంగాణకు చెందినవారు నలుగురుంటే, ఈసారి ఒకరే ఉన్నారన్నారు. అలాగే వందలోపు ర్యాంకులు వచ్చినవారు గతేడాది 16 మంది ఉంటే, ఈసారి పదిలోపే పరిమితం కావాల్సి వచ్చిందన్నారు. అలాగే గతేడాది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు మొదటి 50 ర్యాంకుల్లో ఏడు ర్యాంకులుంటే, ఈసారి నాలుగు ర్యాంకులే ఉన్నాయన్నారు. –––––––––––––––––––––––– దేశవ్యాప్తంగా ‘నీట్’పరీక్షలో అర్హులైనవారు.. –––––––––––––––––––––––– కేటగిరీ పర్సంటైల్ కటాఫ్ మార్కు అర్హులు –––––––––––––––––––––––– జనరల్ 50 701–134 7,04,335 ఓబీసీ 40 133–107 63,789 ఎస్సీ 40 133–107 20,009 ఎస్టీ 40 133–107 8,455 ––––––––––––––––––––––––– కార్డియాలజిస్టును అవుతా – మాధురీరెడ్డి నీట్–2019 ఫలితాల్లో జాతీయ స్థాయిలో 7వ ర్యాంకు, అమ్మాయిల్లో తొలి ర్యాంకు సాధించిన గంగదాసరి మాధురీరెడ్డి ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరతానని చెప్పారు. కార్డియాలజిస్ట్ కావాలన్నదే తన లక్ష్యమన్నారు. మాదాపూర్ నారాయణ కాలేజీలో చదివానని, ప్రతీ రోజు ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటల దాకా నీట్ పరీక్ష కోసం చదివానన్నారు. తండ్రి తిరుపతిరెడ్డి ఐటీ కంపెనీలో పనిచేస్తుండగా, తల్లి పద్మ గృహిణి. తన విజయంలో తల్లిదండ్రుల పాత్ర కీలకమన్నారు. డీన్ సాయి లక్ష్మి, టీచర్ల ప్రోత్సాహం మరవలేనిదని చెప్పారు. -
ఏపీ ఎంసెట్‌లో తొలిరోజు 8వేల వెబ్ ఆప్షన్లు
మార్పులు, చేర్పులకు 19, 20న చివరి అవకాశం సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎంసెట్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల ప్రవేశాలకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. ఎంసెట్‌లో 1 నుంచి 35వేల ర్యాంకు అభ్యర్థులు గురు, శుక్రవారాల్లో ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. తొలిరోజు దాదాపు 8వేల మంది ఆప్షన్లు ఎంచుకున్నారని ఎంసెట్ అడ్మిషన్ల కమిటీ పేర్కొంది. వీరిలో ట్యాప్ ర్యాంకర్లు ఇంకా ఆప్షన్లు నమోదు చేయలేదని, జేఈఈ మెయిన్స్‌తో సహా ఇతర ప్రవేశపరీక్షలు రాసిన విద్యార్థులు అక్కడా మంచి ర్యాంకులే సాధించినందున వారి ప్రాధాన్యతలు ఐఐటీ, ఎన్ఐటీ తదితర జాతీయ విద్యాసంస్థలు, ప్రముఖ ప్రైవేటు సంస్థలపై ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక ధ్రువపత్రాల పరిశీలనకు 29,968 మంది సర్టిఫికెట్లను ఇచ్చారని అధికారులు వివరించారు. ఆయా ర్యాంకుల అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీల్లో నిర్ణీత సమయంలో ఎన్నిసార్లయినా ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, మార్పులు చేర్పులు చేసుకోవచ్చని అడ్మిషన్ల కమిటీ ప్రత్యేకాధికారి రఘునాథ్ వివరించారు. మరుసటి రోజు నుంచి తక్కిన ర్యాంకర్లకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశముంటుందన్నారు. మళ్లీ 19, 20 తేదీల్లో మాత్రమే మొత్తం ర్యాంకర్లందరూ తమ ఆప్షన్లలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి రెండు రోజులు చివరి అవకాశమిస్తామని చెప్పారు. జూన్ 22న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. -
మన విద్యావిధానంపై...
ఇప్పటి విద్యావిధానంతో పిల్లల ఇబ్బందులు, వారి మీద ఆ ఒత్తిడి ఎలా ఉందన్న అంశంతో ‘టాప్ ర్యాంకర్స్’ అనే చిత్రం రూపొందుతోంది. రాజేంద్రప్రసాద్ కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి గోళ్ళపాటి నాగేశ్వరరావు దర్శకుడు. పసుపులేటి బ్రహ్మం నిర్మాత. సోనీ చరిష్టా నటిస్తున్నారు. ఈ నెల 30న విడుదల. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ ‘‘ఈ క్లిష్టమైన అంశాన్ని చాలా బాగా డీల్ చేశారు’’ అని చెప్పారు -
టాప్ ర్యాంకు విద్యార్థులకే 100% ఫీజు!
కటాఫ్‌గా ఏ ర్యాంకును తీసుకోవాలనే అంశంపై ఆలోచనలు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో తుది నిర్ణయం సాక్షి, హైదరాబాద్: వివిధ రకాల వృత్తివిద్యా కోర్సుల ప్రవేశ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా ఫీజులను చెల్లించే ందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రతిభావంతులైన విద్యార్థులకే ఫీజును ఇవ్వాలని భావిస్తున్న ప్రభుత్వం వారి ర్యాంకుల ఆధారంగా ఎంత శాతం ఫీజు చెల్లించాలనే అంశంపై చర్చిస్తోంది. కనీస ఉత్తీర్ణత శాతం, కనీస హాజరు శాతం వంటి అంశాలను ఫీజుల చెల్లింపులో పరిగణనలోకి తీసుకుంటున్న ప్రభుత్వం టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు వారు చేరే కాలేజీల్లో ప్రవేశానికి నిర్ధారించిన ఫీజు మొత్తాన్ని (100 శాతం) చెల్లించాలని భావిస్తోంది. మిగతా విద్యార్థులకు మాత్రం ఆయా కోర్సుల్లో ప్రవేశానికి నిర్ధారించిన కనీస ఫీజును మాత్రమే చెల్లించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తద్వారా ప్రతిభావంతులను ప్రోత్సహించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం (ఫాస్ట్) పథకం వర్తింపులో ఈ మేరకు కటాఫ్ ర్యాంకులను నిర్ధారించనుంది. ఈ నేపథ్యంలో 2 వేల ర్యాంకు లేదా 5వేల ర్యాంకును కటాఫ్‌గా తీసుకుంటే ఎలా ఉంటుందనే అంశంపై పరిశీలన జరుపుతోంది. ఉదాహరణకు ఇంజనీరింగ్ కన్వీనర్ కోటాలో కనీస ఫీజు రూ. 35 వేలు కాగా గరిష్టంగా 1.56 లక్షల వరకు ఫీజు ఉంది. ప్రభుత్వం నిర్ధారించే కటాఫ్ ర్యాంకుల్లో ఉన్న వారికి ఆయా కాలేజీల్లో ప్రవేశానికి అయ్యే మొత్తం ఫీజును ప్రభుత్వం విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఇక మిగతా విద్యార్థులకు మాత్రం కనీస ఫీజునే చెల్లిస్తుంది. మిగతా మొత్తాన్ని సదరు విద్యార్థే భరించాల్సి ఉంటుంది. ఉదాహరణకు రూ. 55 వేలు ఫీజు ఉన్న కాలేజీలో ఓ విద్యార్థి చేరితే ప్రభుత్వం రూ. 35 వేలు ఇస్తే మిగతా రూ. 20 వేలను విద్యార్థి చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి వృత్తి విద్యా కోర్సులో ఇదే విధానాన్ని అనుసరించబోతోంది. అయితే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రం వంద శాతం ఫీజును చెల్లించనుంది. బీసీ, ఈబీసీ విద్యార్థులకు మాత్రం కొత్తగా అమల్లోకి తేనున్న విధానాన్ని అనుసరించనుంది. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు కాకుండా ఇతర సామాజిక వర్గాల విద్యార్థులకు 10 వేల లోపు ర్యాంకు ఉంటే వారి మొత్తం ఫీజును ప్రభుత్వమే భరించేది. ఇకపై అలా కుదరదని తెలుస్తోంది. అయితే దీనిపై రెండు మూడు రోజుల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. కాలేజీల నియంత్రపైనా దృష్టి.. కాలేజీలను నియంత్రించేందుకు, ప్రమాణాలు పాటించేలా చేసేందుకు ప్రత్యేక నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనిపై అధికారుల స్థాయిలో కసరత్తు ప్రారంభమైంది. అర్హులైన ఫ్యాకల్టీ, నాణ్యమైన విద్యా బోధన కోసం థర్డ్ పార్టీచేత ఆకస్మిక తనిఖీలు చేయాలనే ప్రతిపాదన గతంలో ఉంది. దానికి ఇపుడు జీవం పోసి ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అంతేకాక కాలేజీల్లో లోపాలు, అక్రమాలపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబరును ఏర్పాటు చేయనున్నారు. తద్వారా కాలేజీలను నియంత్రించడంతోపాటు, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం సాధ్యం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. -
యూత్ అంటే బూతు కాదు
వైవిధ్యభరితమైన పాత్రలను చేయడానికి ఎప్పుడూ ముందుంటారు డా.రాజేంద్రప్రసాద్. పాత్రలో పూర్తిగా ఒదిగిపోవడానికి తన ఆహార్యాన్ని, శారీరక భాషను మార్చుకుంటారు. అందుకు నిదర్శనంగా మేడమ్, ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి.. ఇలా పలు చిత్రాలను చెప్పుకోవచ్చు. త్వరలో ‘టాప్ ర్యాంకర్స్’ చిత్రంలో రాజేంద్రప్రసాద్ ఓ వినూత్నమైన లుక్‌లో కనిపించబోతున్నారు. విశ్వవిజన్ ఫిలింస్ పతాకంపై కేవీకే రావ్ సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ సమర్పణలో పసుపులేటి బ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మించారు. గోళ్లపాటి నాగేశ్వరరావు దర్శకుడు. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘విద్యార్థులు, విద్యా సంస్థలు, తల్లిదండ్రులు .. ఈ ముగ్గురి చుట్టూ తిరిగే కథ ఇది. తెలుగు పరిశ్రమలో ఇప్పటివరకు రాని ఓ కొత్త కథతో ఈ సినిమా చేశాం. యూత్ అంతే బూతు కాదని చెప్పే చిత్రం. జయసూర్య స్వరపరచిన ఈ చిత్రం పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. సినిమా కూడా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు.