గర్ల్ఫ్రెండ్ను హీరో పిచ్చికొట్టుడు కొట్టాడు | Tom Sizemore arrested for reportedly beating up girlfriend | Sakshi
Sakshi News home page

గర్ల్ఫ్రెండ్ను హీరో పిచ్చికొట్టుడు కొట్టాడు

Jul 20 2016 12:06 PM | Updated on Apr 3 2019 8:57 PM

గర్ల్ఫ్రెండ్ను హీరో పిచ్చికొట్టుడు కొట్టాడు - Sakshi

గర్ల్ఫ్రెండ్ను హీరో పిచ్చికొట్టుడు కొట్టాడు

తన ప్రేయసిని ఇంట్లో పడేసి చావుదెబ్బలు కొట్టినందుకు ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్ సీజ్మోర్ను పోలీసులు అరెస్టు చేశారు.

లాస్ ఎంజెల్స్: తన ప్రేయసిని ఇంట్లో పడేసి చావుదెబ్బలు కొట్టినందుకు ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్ సీజ్మోర్ను పోలీసులు అరెస్టు చేశారు. గృహహింస కింద అతడిపై అభియోగాలు మోపారు. సేవింగ్ ప్రైవేట్ రియాన్, బ్లాక్ హాక్ డోన్ వంటి ప్రముఖ చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించిన ఆయనను మంగళవారం ఉదయం తర్వాత తమ అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టామ్ ఇంటి నుంచి 911 నెంబర్ కు పదే పదే ఫోన్ కాల్స్ వచ్చాయి.

అందులో బాగా ఏడుస్తున్నట్లు కేకలు వినిపించాయి. ఫైటింగ్ జరుగుతున్న రేంజ్ లో చప్పుళ్లు వినిపించాయి. దీంతో, శరవేగంగా అక్కడికి పోలీసులు వెళ్లగా ఓ యువతిపై చేయి చేసుకుంటూ టామ్ కనిపించాడు. అయితే, అక్కడికి వెళ్లిన తర్వాత పోలీసులకు ఆమె అతడి గర్ల్ ఫ్రెండ్ అని తెలిసింది. తొలుత వాదులాడుకున్నవారు అనంతరం చేయిచేసుకునే వరకు గొడవ వెళ్లిందని గుర్తించారు. తన ముఖంపైనా, తలపైన కొట్టాడని పోలీసులకు ఆమె చెప్పింది. గాయాలు కూడా బాగానే పైకి కనిపించాయి. అయితే, మెడికల్ పరీక్షలకు వెళ్లేందుకు ఆమె నిరాకరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement