స్క్రీన్‌ టెస్ట్‌

tollywood movies special screen test - Sakshi

1. హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ మొదట ఏ సినిమాకు డబ్బింగ్‌ చెప్పుకున్నారో తెలుసా?
ఎ) ధృవ బి) జయ జానకీ నాయకా సి) సరైనోడు డి) నాన్నకు ప్రేమతో

2. అదితీ రావు హైదరీ సిల్వర్‌ స్క్రీన్‌పై మొదట ఏ హీరోతో నటించారో తెలుసా?
ఎ) మమ్ముట్టి బి) కార్తీ సి) సుధీర్‌ బాబు డి) ధనుశ్‌

3. హీరో నాని గతంలో కబడ్డీ ఆటగాడిగా నటించారు. ఇప్పుడు ఆయన మరో క్రీడా నేపథ్యం ఉన్న చిత్రంలో నటిస్తున్నారు. ఏ క్రీడకు సంబంధించిన చిత్రంలో ఆయన నటిస్తున్నారు?
ఎ) బ్యాడ్మింటన్‌    బి) క్రికెట్‌ సి) హాకీ  డి) ఖోఖో

4. దాసరి దర్శకత్వం వహించిన సూపర్‌హిట్‌ సినిమా ‘గోరింటాకు’. ఆ చిత్రంలో కథానాయిక పాత్ర చేశారు నటి సుజాత. మొదట దర్శక,నిర్మాతలు అనుకున్న హీరోయిన్‌ సుజాత కాదట. మరి మొదట అనుకున్న హీరోయిన్‌ ఎవరో తెలుసా?
ఎ) మాధవి     బి) సరిత సి) రాధిక     డి) సుహాసిని

5. కృష్ణ నటించిన ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రానికి రచయితెవరో తెలుసా?
ఎ) పద్మరాజు  బి) జంధ్యాల సి) పరుచూరి బ్రదర్స్‌ డి) మహారధి

6. ఐశ్వర్యారాయ్‌ ఏ హీరోని సినిమాలో చిట్టీ అని పిలిచారో గుర్తుందా?
ఎ) రజనీకాంత్‌   బి) కమల్‌ హాసన్‌   సి) విజయ్‌         డి) విక్రమ్‌

7. ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలోని ‘పెనివిటి...’ పాటను పాడింది ఎవరు?
ఎ) కాలభైరవ    బి) శ్రీరామచంద్ర  సి) హేమచంద్ర  డి) దీపు

8. ‘హలో గురు ప్రేమ కోసమే’ చిత్రంలో హీరో రామ్‌. ఆ చిత్రంలో ఓ హీరోయిన్‌గా అనుపమా పరమేశ్వరన్‌ నటించారు. మరో హీరోయిన్‌ ఎవరు?
ఎ) రష్మికా మండన్నా  బి) ప్రణీత సుభాశ్‌  సి) లావణ్య త్రిపాఠి డి) రాశీ ఖన్నా

9. ప్రభాస్‌ హీరోగా తెలుగులో ఇప్పటివరకు ఎన్ని చిత్రాలు రిలీజ్‌  అయ్యాయో కనుక్కోండి?
ఎ) 14 బి) 24 సి) 16 డి) 18

10. ‘హౌస్‌ఫుల్‌ 4’ నుంచి నానా పటేకర్‌ తప్పుకున్నాక ఆ పాత్రకు ఓ తెలుగు హీరోని తీసుకున్నారు. అతనెవరో తెలుసా?
ఎ) రానా బి) సందీప్‌ కిషన్‌ సి) నాని డి) అఖిల్‌

11. అల్లు అర్జున్, మంచు మనోజ్‌ ఈ ఇద్దరు హీరోలు నటించిన ‘వేదం’ చిత్రంలో వేశ్య పాత్రలో నటించిన నటి ఎవరు?
ఎ) ధీక్షాసేథ్‌∙  బి) కమలినీ ముఖర్జీ  సి) అనుష్క     డి) శ్రియ

12. ప్రముఖ నటి సౌందర్య తనకి ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు తిరిగి రాని లోకాలకు వెళ్లారో తెలుసా?
ఎ) 42 బి) 36 సి) 32 డి) 35

13. ‘బొబ్బిలి రాజా’ చిత్రంలో వెంకటేశ్‌కు అత్తగా పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌లో నటì ంచిన ప్రముఖ నటి ఎవరో గుర్తున్నారా?
ఎ) శారద       బి) వాణీశ్రీ  సి) జయచిత్ర   డి) జయంతి

14. ‘స్టూవర్టుపురం పోలీస్‌ స్టేషన్‌’ చిత్రంలో నటించిన హీరోయిన్‌ నిరోషా ఓ ప్రముఖ హీరోయిన్‌కి చెల్లెలు. ఆ హీరోయిన్‌ పేరేంటి?
ఎ) రాధిక       బి) జయసుధ   సి) జయప్రద  డి) రాధ

15. ‘మహానటి’ చిత్రంలో జెమినీ గణేశన్‌ మొదటి భార్యగా నటించిన హీరోయిన్‌ ఎవరో తెలుసా?
ఎ) మాళవికా నాయర్‌   బి) నిత్యామీనన్‌    సి) కీర్తీ సురేశ్‌  డి) మాళవికా శర్మ

16. 2018లో విడుదలైన మూవీ ‘గీతగోవిందం’ లోని ‘‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలి..’’ అనే సూపర్‌హిట్‌ పాట రచయితెవరో కనుక్కోండి?
ఎ) శ్రీమణి      బి) అనంత శ్రీరామ్‌  సి) వరికుప్పల యాదగిరి  డి) చంద్రబోస్‌

17. శ్రీను వైట్ల దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’ లో నటిస్తున్న హీరోయిన్‌ ఎవరు?
ఎ) రెజీనా  బి) కాజల్‌ అగర్వాల్‌ సి) ఇలియానా డి) నయనతార

18. జయప్రద లీడ్‌ రోల్‌లో నటించిన సూపర్‌హిట్‌ సినిమా ‘అంతులేని కథ’ చిత్రానికి దర్శకుడెవరో కనుక్కోండి?
ఎ) దాసరి నారాయణరావు  బి) కె.బాలచందర్‌ సి) భారతీరాజా డి) మణిరత్నం

19. ఈ ఫోటోలో ఉన్న చిన్నప్పటి బాలీవుడ్‌ భామ ఎవరో తెలుసా?
ఎ) దీపికా పదుకోన్‌∙  బి) కాజోల్‌    సి) అయేషా టకియా డి) కరీనా కపూర్‌

20. చిరంజీవి నటించిన ఈ స్టిల్‌ ఏ సినిమాలోనిదో కనుక్కోండి?
ఎ) కొండవీటి దొంగ  బి) సింహపురి సింహం సి) మంచి దొంగ డి) రాజా విక్రమార్క

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...  ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!

సమాధానాలు
1) డి 2) ఎ 3) బి 4) డి
5) డి 6) ఎ 7) ఎ 8) బి 9) డి
10) ఎ 11) సి  12) సి 13) బి
14) ఎ 15) ఎ 16) బి 17) సి
18) బి 19) ఎ
20) బి
నిర్వహణ:
శివ మల్లాల

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top