‘టాక్సీవాలా’ తర్వాత విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్‌లో వీడీ14 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సారి తమ హీరో విజయ్ దేవరకొండ కు మంచి హిట్ మూవీ ఇవ్వాలంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా డైరెక్టర్ రాహుల్ కు రిక్వెస్ట్స్ పంపుతున్నారు.
రీసెంట్ గా యశ్వంత్ అనే విజయ్ దేవరకొండ ఫ్యాన్ తమ హీరోకు మెమొరుబల్ మూవీ ఇవ్వాలటూ హార్ట్ టచింగ్ రిక్వెస్ట్ ఒకటి పంపారు. ఆ అభిమాని రిక్వెస్ట్ కు స్పందించిన రాహుల్ సంకృత్యన్ 'మీ అభిమానులందరి ఆకలి తీర్చేలా వీడీ 14 ఉంటుంది..' అంటూ ప్రామిస్ చేశారు. విజయ్ అభిమానికి స్పందిస్తూ రాహుల్ ఇచ్చిన రిప్లైతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా కథతో దర్శకుడు రాహుల్ సంకృత్యన్ వీడీ 14 చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది.



