స్క్రీన్‌ టెస్ట్‌

tollywood movies special screen test - Sakshi

1. ఓ సినిమా కోసం మహేశ్‌బాబు సిక్స్‌ప్యాక్‌ చేశారు. ఆ సినిమా ఏదో తెలుసా?
ఎ) 1 నేనొక్కడినే     బి) బిజినెస్‌ మేన్‌  సి) పోకిరి               డి) ఖలేజా

2. భారతదేశ విశిష్ట పురస్కారాలైన పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్‌... ఈ మూడు పురస్కారాలను  దక్కించుకున్న ఏకైక భార తీయ సినీ నటుడెవరు?
ఎ) అక్కినేని నాగేశ్వరరావు బి) యన్టీ రామారావు సి) చిరంజీవి డి) అమితాబ్‌

3.  ‘వీర మహాదేవి’ అనే చిత్రంలో నటిస్తున్న హాట్‌ గర్ల్‌ ఎవరో తెలుసా?
ఎ) షెర్లిన్‌ చోప్రా  బి) సన్నీ లియోన్‌  సి) మల్లికా శెరావత్‌  డి) పూనమ్‌ పాండే

4. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌ బాబు నటిస్తున్న చిత్రంలో  హీరోయిన్‌ ఎవరు?
ఎ) శ్రుతీహాసన్‌    బి) కృతీ సనన్‌  సి) పూజా హెగ్డే    డి) అదితీరావ్‌ హైదరీ

5. దర్శకుడు కోడి రామకృష్ణ.. దాసరి నారాయణరావు శిష్యుడు. గురువుకు, శిష్యునికి దర్శకులవ్వటానికి అవకాశం ఇచ్చిన నిర్మాత ఒక్కరే. ఆ నిర్మాత ఎవరు?
ఎ) నాగిరెడ్డి–చక్రపాణి  బి) దుక్కిపాటి మధుసూదనరావు సి) కె. రాఘవ  డి) డి. రామానాయుడు

6. ‘అవతలి వాళ్లని మనం ఎంత కోరుకుంటున్నామో అది మన కళ్లల్లో కనిపించాలి’.. అనే డైలాగ్‌ రాసిన  రచయితెవరో కనుక్కోండి? (చిన్న క్లూ– ఈ డైలాగ్‌ ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలోనిది)
ఎ) అబ్బూరి రవి           బి) కోన వెంకట్‌    సి) మేర్లపాక గాంధీ     డి) బుర్రా సాయిమాధవ్‌

7. బాలీవుడ్‌లో నానాపటేకర్‌ నటించిన ‘క్రాంతివీర్‌’  తెలుగు రీమేక్‌లో నానా స్థానంలో నటించిన నటుడెవరో కనుక్కోండి?
ఎ) శోభన్‌ బాబు   బి) మోహన్‌ బాబు   సి) నాగార్జున   డి) వెంకటేశ్‌

8. ‘ఓ సుబ్బారావో, ఓ అప్పారావో, ఓ వెంకట్రావో, ఓ రంగారావో  ఎవరో ఎవరో ఎవరో ఎవరో వస్తారనుకుంటే నువ్వొచ్చావా..’  అనే పాటను రాసింది  పాటల రచయిత కాదు ఓ దర్శకుడు. ఆ దర్శకుడెవరో తెలుసా?
ఎ) ఎ. కోదండ రామిరెడ్డి   బి) కోడి రామకృష్ణ   సి) కె. రాఘవేంద్ర రావు  డి) దాసరి నారాయణరావు

9. హీరో కృష్ణతో ఎక్కువ సినిమాల్లో (50 చిత్రాలు) హీరోయిన్‌గా నటించిన హీరోయిన్‌ విజయనిర్మల. ఆమె తర్వాత ఆయన సరసన ఓ హీరోయిన్‌ 45 సినిమాల్లో నటించారు. ఆ హీరోయిన్‌ ఎవరో కనుక్కోండి?
ఎ) శారద    బి) జయప్రద    సి) విజయశాంతి   డి) జయసుధ

10. ‘చారులత’ సినిమాలో అవిభక్త  కవలలుగా నటించిన హీరోయిన్‌ ఎవరు?
ఎ) అంజలి     బి) ప్రియమణì      æ సి) స్నేహ       డి) హన్సిక

11. హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌  ఇప్పటివరకు చేసిన  తెలుగు సినిమాలెన్నో ఓ సారి లెక్కెట్టండి?
ఎ) 12   బి) 15   సి) 18   డి) 19

12. వేల్‌ రికార్డ్స్‌ ఆడియో కంపెనీ అధినేత ఎవరో తెలుసా? చిన్న క్లూ: ఆమె ఓ ప్రముఖ సంగీత దర్శకుని సతీమణి.
ఎ) వల్లీ           బి) రమా  సి) సునీత      డి) కౌసల్య

13. ‘అ’ చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఇప్పుడు బాలీవుడ్‌లో వచ్చిన ‘క్వీన్‌’ సినిమా తెలుగు రీమేక్‌ని తెరకెక్కిస్తున్నారు. ‘అ’ని నిర్మించింది ఓ ప్రముఖ తెలుగు హీరో. ఎవరా హీరో?
ఎ) సందీప్‌ కిషన్‌    బి) నాగశౌర్య  సి) నాని                డి) నాగచైతన్య

14. నాగార్జున,  అమల  వివాహ తేదీ జూన్‌ 11.  ఏ సంవత్సరంలో వీరి పెళ్లి  జరిగింది?
ఎ) 1990     బి) 1989  సి) 1995     డి) 1992

15. ‘పండగ చేస్కో’ సినిమాలో రామ్‌ సరసన ఇద్దరు కథానాయికలు నటించారు. అందులో ఒకరు రకుల్‌ ప్రీత్‌సింగ్, మరో హీరోయిన్‌ ఎవరో కనుక్కోండి?
ఎ) అనుపమా పరమేశ్వరన్‌  బి) తమన్నా   సి) సోనాల్‌ చౌహాన్‌  డి) మాళవికా శర్మ

16.  ఈ మధ్యే 75 చిత్రాల క్లబ్‌లో చేరిన సంగీత దర్శకుడెవరో కనుక్కోండి?
ఎ) అనూప్‌ రూబెన్స్‌  బి) యస్‌.యస్‌. తమన్‌ సి) దేవిశ్రీ ప్రసాద్‌ డి) సాయి కార్తీక్‌

17. ఇటీవల రిలీజైన బాలీవుడ్‌ చిత్రం ‘రాజీ’ 100 కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఆ సినిమాలో నటించిన హీరోయిన్‌ ఎవరు?
ఎ) కరీనా కపూర్‌ బి) కత్రినా కైఫ్‌  సి) ఆలియా భట్‌  డి) డయానా పెంటీ

18. 1961లో ఎన్టీఆర్‌ నటించిన ‘సీతారామ కళ్యాణం’ చిత్రానికి  దర్శకుడెవరో తెలుసా? ఆయన నటుడు కూడా.
ఎ) ఎన్టీఆర్‌  బి) అక్కినేని  సి) కాంతారావు డి) యస్వీ రంగారావు

19. ఈ ఫొటోలోని చిన్నారి ఎవరు?
ఎ) నిత్యామీనన్‌  బి) అనుపమా పరమేశ్వరన్‌  సి) ఆలియా భట్‌ డి) శోభన

20. ఈ స్టిల్‌ ఏ సినిమాలోదో చెప్పుకోండి?
ఎ) మిస్సమ్మ  బి) గుండమ్మకథ   సి) అన్నపూర్ణ డి) దొంగరాముడు

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...   మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...  ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!

సమాధానాలు
1) ఎ 2) ఎ 3) బి 4) సి 5) సి 6) సి 7) బి 8) డి 9) బి 10) బి 11) బి
12) ఎ 13) సి 14) డి 15) సి 16) బి 17) సి 18) ఎ 19) ఎ 20) డి

నిర్వహణ: శివ మల్లాల

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top