రేడియో సిటీలో 'తొలి పరిచయం' సాంగ్ లాంచ్ | Toliparichayam First song Launch | Sakshi
Sakshi News home page

రేడియో సిటీలో 'తొలి పరిచయం' సాంగ్ లాంచ్

Feb 21 2017 10:56 AM | Updated on Sep 5 2017 4:16 AM

రేడియో సిటీలో 'తొలి పరిచయం' సాంగ్ లాంచ్

రేడియో సిటీలో 'తొలి పరిచయం' సాంగ్ లాంచ్

పియుకే ప్రొడక్షన్స్‌ పతాకంపై వెంకీ, లాస్య జంటగా తెరకెక్కుతున్న సినిమా తొలి పరిచయం. ఎల్‌.రాధాకృష్ణను దర్శకుడిగా

పియుకే ప్రొడక్షన్స్‌ పతాకంపై వెంకీ, లాస్య జంటగా తెరకెక్కుతున్న సినిమా తొలి పరిచయం. ఎల్‌.రాధాకృష్ణను దర్శకుడిగా పరిచయం చేస్తూ దీపక్‌ కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ సాంగ్ లాంచ్ సోమవారం హైదరాబాద్లో రేడియో సిటీలో జరిగింది.  ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొన్నారు.

ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. పెళ్లి అంటే ఇష్టం లేని ఒక అమ్మాయి, అబ్బాయి ఒకే ఇంట్లో గడపాల్సి వస్తే... ఆ తర్వాత ఏమి జరిగింది అన్నది  చిత్ర కథాంశం. పోలవరం  ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా, పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. త్వరలోనే ఆడియో రిలీజ్, సినిమా రిలీజ్ డేట్లను ఎనౌన్స్ చేయనున్నారు చిత్రయూనిట్.

Advertisement
 
Advertisement
Advertisement