ప్రేమలో ఓడిన స్త్రీ | to lose in love a woman | Sakshi
Sakshi News home page

ప్రేమలో ఓడిన స్త్రీ

Apr 11 2014 1:23 AM | Updated on Sep 2 2017 5:51 AM

ప్రేమలో ఓడిన స్త్రీ

ప్రేమలో ఓడిన స్త్రీ

ప్రేమలో ఓడిన ఒక స్త్రీ ఏం చేసిందనేదే కాదలిక్కు కన్నిల్లై చిత్రం అని ఆ చిత్ర దర్శకుడు, నటుడు జై ఆకాష్ తెలిపారు.

ప్రేమలో ఓడిన ఒక స్త్రీ ఏం చేసిందనేదే కాదలిక్కు కన్నిల్లై చిత్రం అని ఆ చిత్ర దర్శకుడు, నటుడు జై ఆకాష్ తెలిపారు. ఈయన కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తూ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రాన్ని ఎం ఎం ఎం క్రియేషన్స్ సంస్థ, జై బాలాజి మూవీ మేకర్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
 
అలీషా దాస్, నిషా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇతర ముఖ్యపాత్రల్లో వై.ఇందు, లలిత్య, ప్రభాకరన్, శ్రీరమ్య తదితరులు నటిస్తున్నారు. చిత్రం గురించి దర్శక , నటుడు జై ఆకాష్ మాట్లాడుతూ, 17 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వరకు జీవితంలో ప్రేమ పోరాటం చేసిన ఒక స్త్రీ ఇతివృత్తమే కాదలుక్కు కన్నిల్లై చిత్ర కథ అని చెప్పారు. ఒక వ్యక్తిని ప్రేమించి అతని ద్వారా తన జీవితాన్ని కోల్పోయిన ఆ స్త్రీ ఏమి చేసిందనే పలు ఆసక్తికరమైన సన్నివేశాల సమాహారం ఈ చిత్రం అని పేర్కొన్నారు.
 
తాను ఇందులో రెండు వైవిధ్యమైన పాత్రల్ని పోషిస్తున్నట్లు తెలిపారు. యుకె మురళి సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల చెన్నైలో జరిగింది. 

Advertisement
 
Advertisement
Advertisement