ఇద్దరి స్నేహితుల కథ | 'To Friends' will be shot in Hyderabad on 9th of this month. | Sakshi
Sakshi News home page

ఇద్దరి స్నేహితుల కథ

Jun 5 2017 2:12 AM | Updated on Sep 5 2017 12:49 PM

ఇద్దరి స్నేహితుల కథ

ఇద్దరి స్నేహితుల కథ

ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య స్నేహాన్ని ప్రేమగా అపార్థం చేసుకోవడం

ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య స్నేహాన్ని ప్రేమగా అపార్థం చేసుకోవడం వల్ల ఇద్దరి స్నేహితుల జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయనే కథతో రూపొందుతోన్న సినిమా ‘టు ఫ్రెండ్స్‌’. ట్రూ లవ్‌... అనేది ఉపశీర్షిక.

శ్రీనివాస్‌ జి.ఎల్‌.బి. దర్శకత్వంలో అనంతలక్ష్మి కియేషన్స్‌ పతాకంపై ముళ్ళగూరు అనంతరాముడు, ముళ్ళగూరు రమేష్‌నాయుడు నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా కన్నడ హీరో సూరజ్‌ తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఇందులో రవీంద్ర తేజ మరో హీరో. సానియా, ఫారా హీరోయిన్లు. ఈ నెల 9న హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలు కానుంది. ‘‘స్నేహం, ప్రేమ, త్యాగం ప్రధానాంశాలుగా సినిమా నిర్మిస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు. కోట శ్రీనివాసరావు కీలక పాత్ర చేయనున్న ఈ సినిమాకు పొలూర్‌ ఘటికాచలం çసంగీత దర్శకుడు.

Advertisement
 
Advertisement
Advertisement