breaking news
Ravindra Teja
-
ఇద్దరి స్నేహితుల కథ
ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య స్నేహాన్ని ప్రేమగా అపార్థం చేసుకోవడం వల్ల ఇద్దరి స్నేహితుల జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయనే కథతో రూపొందుతోన్న సినిమా ‘టు ఫ్రెండ్స్’. ట్రూ లవ్... అనేది ఉపశీర్షిక. శ్రీనివాస్ జి.ఎల్.బి. దర్శకత్వంలో అనంతలక్ష్మి కియేషన్స్ పతాకంపై ముళ్ళగూరు అనంతరాముడు, ముళ్ళగూరు రమేష్‌నాయుడు నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా కన్నడ హీరో సూరజ్ తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఇందులో రవీంద్ర తేజ మరో హీరో. సానియా, ఫారా హీరోయిన్లు. ఈ నెల 9న హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలు కానుంది. ‘‘స్నేహం, ప్రేమ, త్యాగం ప్రధానాంశాలుగా సినిమా నిర్మిస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు. కోట శ్రీనివాసరావు కీలక పాత్ర చేయనున్న ఈ సినిమాకు పొలూర్ ఘటికాచలం çసంగీత దర్శకుడు. -
సున్నితమైన ప్రేమకథ
తెలుగబ్బాయి రవీంద్ర తేజ ‘గంగావతి’ అనే కన్నడ మూవీలో హీరోగా నటిస్తున్నాడు. అలాగే ఓ తెలుగు చిత్రం కూడా చేయనున్నాడు. ‘సాయే దైవం’ ఫేం జి.ఎల్.బి. శ్రీనివాస్ దర్శకత్వంలో అనంతలక్ష్మి క్రియేషన్స్ పతాకంపై ముళ్ళగూరు అనంతరాయుడు, ముళ్ళగూరు రమేష్ నాయుడు ఈ చిత్రం నిర్మించనున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఇది సున్నితమైన ప్రేమకథ. ఫిబ్రవరిలో షూటింగ్ మొదలుపెడతాం. ఈ చిత్రానికి రచన–సంగీతం: పోలూర్ ఘటికాచలం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: డి.వై.రఘురామ్, సమర్పణ: ముళ్ళగూరు లక్ష్మీదేవి.