థ్రిల్ చేసే... మాంజ | Thrilling manja | Sakshi
Sakshi News home page

థ్రిల్ చేసే... మాంజ

Oct 17 2015 12:07 AM | Updated on Sep 3 2017 11:04 AM

థ్రిల్ చేసే... మాంజ

థ్రిల్ చేసే... మాంజ

కిషన్ ఎస్.ఎస్, అవికా గోర్, దీప్ పాఠక్, నరేష్ డింగ్రీ, ఈషా డియోల్ కాంబినేషన్‌లో కిషన్ ఎస్.ఎస్. దర్శకత్వంలో రూపొందిన కన్నడ చిత్రం

కిషన్ ఎస్.ఎస్, అవికా గోర్, దీప్ పాఠక్, నరేష్ డింగ్రీ, ఈషా డియోల్ కాంబినేషన్‌లో కిషన్ ఎస్.ఎస్. దర్శకత్వంలో రూపొందిన కన్నడ చిత్రం ‘ఫుట్‌పాత్-2’ తెలుగులో ‘మాంజ’ పేరుతో రానుంది. రాజ్ కందుకూరి సమర్పణలో గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేసిన అవికా గోర్ మాట్లాడుతూ - ‘‘ఇది డిఫరెంట్ మూవీ. ఇంత మంచి సినిమాలో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది’’ అన్నారు. కిషన్ మాట్లాడుతూ - ‘‘బాల నేరస్థుల దగ్గర ఎన్నో విషయాలు తెలుసుకుని ‘ఫుట్‌పాత్ -2’ కథ తయారు చేశాం.

ఈ చిత్రాన్ని ఆస్కార్ అవార్డ్స్ జనరల్ కేటగిరీలో లేటరల్ ఎంట్రీ కోసం సబ్మిట్ చేశాం’’ అని తెలిపారు. అవికా గోర్‌తో ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ సినిమా చేస్తున్న టైమ్‌లో ఈ కాన్సెప్ట్ విని థ్రిల్ అయ్యామనీ, వచ్చే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తామనీ నిర్మాతలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement