హల్ చల్ చేస్తున్న ఐశ్వర్య, ఆరాధ్యల ఫోటో | This throwback picture of Aaradhya and Aishwarya is too cute to miss | Sakshi
Sakshi News home page

హల్ చల్ చేస్తున్న ఐశ్వర్య, ఆరాధ్యల ఫోటో

Mar 31 2016 4:33 PM | Updated on Sep 3 2017 8:57 PM

హల్ చల్ చేస్తున్న ఐశ్వర్య, ఆరాధ్యల ఫోటో

హల్ చల్ చేస్తున్న ఐశ్వర్య, ఆరాధ్యల ఫోటో

నటుడు అభిషేక్ బచ్చన్ ట్విట్టర్ ఫ్యాన్ క్లబ్ పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

నటుడు అభిషేక్ బచ్చన్ ట్విట్టర్ ఫ్యాన్ క్లబ్ పోస్ట్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఫోటోలో అందాల తార ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన ముద్దుల కూతురు ఆరాధ్యను ఒడిలో కూర్చోపెట్టుకొని ఉంది. తన నాలుగేళ్ల కూతురుకు ఐష్ ఆప్యాయంగా ముద్దుపెడుతున్న ఈ ఫోటో చూపరులను ఆకట్టుకుంటుంది. ఈ సందర్భంగా ఇటీవల తల్లి ఐష్ కోసం ఆరాధ్య చేసిన ఓ సంఘటనను కూడా సోషల్ మీడియాలో గుర్తు తెచ్చుకుంటున్నారు. 'సరబ్జిత్' షూటింగ్లో బిజీగా ఉంటున్న ఐశ్వర్య కాస్త అనారోగ్యానికి గురయ్యారు. జ్వరం, గొంతు నొప్పితో ఆమె బాధపడుతుండటంతో సరబ్జిత్ షూటింగ్కు ఓ వారం రోజులు విరామం ఇచ్చారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఐశ్వర్య ప్రతిరోజూ ఆరాధ్య స్కూలు వదిలే సమయానికి వెళ్లి తనను వెంటబెట్టుకుని ఇంటికి తీసుకెళ్లేవారు. తల్లి ఆరోగ్యాన్ని రెండు రోజులుగా గమనిస్తున్న ఆరాధ్య స్కూల్లో విరామ సమయంలో 'గెట్ వెల్ సూన్' కార్డు తయారు చేసిందట.

ఎప్పటిలానే సాయంత్రం అమ్మ స్కూల్ గేట్ వద్దకు రాగానే తన చిట్టి చిట్టి చేతులతో తయారుచేసిన 'గెట్ వెల్ సూన్' కార్డును అమ్మకిచ్చిందట. అంతే ఐశ్వర్య ఆనందంతో భావోద్వేగానికి గురయ్యారు. పిల్లలను తీసుకెళ్లడానికి స్కూల్ వద్దకు చేరుకున్న ఇతర తల్లిదండ్రులు కూడా ఆరాధ్య ఆలోచనకు తెగ ముచ్చటపడ్డారు. ఆరాధ్య విషయంలో నేను చాలా అదృష్టవంతురాలినంటూ మురిసిపోతుంది ఐశ్వర్య.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement