నాకంత ఓర్పు లేదు

Thamanna is not interested in direction - Sakshi

ప్రతి ఒక్కరి జీవితంలో ఎత్తు పల్లాలు ఉన్నట్లే పొగడ్తలు, విమర్శలు ఉంటాయి. నటిగా మీ కెరీర్‌లో ఎదురయ్యే విమర్శలను మీరు ఎలా తీసుకుంటారు? అనే ప్రశ్నను తమన్నా ముందు ఉంచితే– ‘‘నేనేం దేవుణ్ణి కాదు. మామూలు మనిషిని. అందరిలాగే నేనూ తప్పులు చేస్తాను. నా తప్పుల గురించి వచ్చిన నిజమైన విమర్శలను మాత్రమే పట్టించుకుంటాను. నన్ను నేను విశ్లేషించుకుని నాలోని లోపాలను సరిదిద్దుకుంటాను.

అంతేకానీ తప్పుడు విమర్శలను పట్టించుకుని అనవసరంగా బాధపడను’’ అని పేర్కొన్నారు. భవిష్యత్‌లో దర్శకత్వం ఆలోచన ఏమైనా ఉందా? అన్నప్పుడు... ‘‘దర్శకత్వం అంటే చిన్న విషయం కాదు. సినిమా గురించిన ప్రతి విషయంపై అవగాహన ఉండాలి. పాత అంశాలను కొత్త దృష్టి కోణంలో చూడగలగాలి. అన్నింటికన్నా ముందు చాలా ఓర్పు ఉండాలి. అంత ఓర్పు నాలో లేదు. ప్రసుతం దర్శకత్వం ఆలోచన లేదు. కానీ శ్రీదేవి బయోపిక్‌ను ఎవరైనా తీస్తే అందులో నటించాలని ఉంది’’ అని పేర్కొన్నారు తమన్నా.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top