ఒక తల కాదా? | Thala Ajith to play a dual role in AK57? | Sakshi
Sakshi News home page

ఒక తల కాదా?

Oct 10 2016 2:12 AM | Updated on Jun 4 2019 6:41 PM

ఒక తల కాదా? - Sakshi

ఒక తల కాదా?

తల తాజా చిత్రంలో ఒకరు కాదు ఇద్దరుగా అజిత్ మరోసారి దుమ్మురేపడానికి రెడీ అవుతున్నారనే టాక్

 తల తాజా చిత్రంలో ఒకరు కాదు ఇద్దరుగా అజిత్ మరోసారి దుమ్మురేపడానికి రెడీ అవుతున్నారనే టాక్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అభిమానులు తల అని పిలుచుకునే అజిత్ తాజా చిత్ర షూటింగ్‌తో చాలా బిజీగా ఉన్నారన్న విషయం తెలిసిందే. ఇది ఆయనకు 57వ చిత్రం అన్నది గమనార్హం. ఈ చిత్రానికి ఇంకాపేరు నిర్ణయంచకపోయినా,ప్రస్తుతం ఏకే 57 అన్న పేరుతోనే పిలుచుకుంటున్నారు. ఇంతకు ముందు అజిత్ హీరోగా వీరం, వేదాళం వంటి విజయవంతమై చిత్రాలను దర్శకత్వం వహించిన శివ ఆయనతో తెరకెక్కిస్తున్న మూడో చిత్రం ఇది.
 
  సత్యజ్యోతి ఫిలింస్ త్యాగరాజన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్‌అగర్వాల్ కథానాయకిగా నటిస్తున్నారు. ఇందులో తల ఒకరు కాదు ఇద్దరుగా నటిస్తున్నారన్నది తాజా సమాచారం. అజిత్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రాలు దాదాపు మంచి విజయాన్ని సాధించాయన్నది గమనార్హం. వాలి,వరలారు, అసల్, అట్టహసం చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారు. వరలారు చిత్రంలో ఏకంగా త్రిపాత్రాభినయంతో అలరించారు. తాజా చిత్ర కథ గురించి కొన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి.
 
 ఇది తమిళనాడులో జరిగిన ఒక నేరం ఇతివృత్తంగా తెరకెక్కుతున్న చిత్రం అని సమాచారం.అయితే ఈ నేరానికి మూలాలు యూరోపియన్ దేశంలో కలిగి ఉండడంతో ఈ మిస్టరీని ఛేదించడానికి ఇంటర్‌పోల్ పోలీస్ అధికారిగా అజిత్ రంగంలోకి దిగుతారట. అయితే ఇందులో మరో అజిత్ పాత్ర మాత్రం చాలా సర్‌ప్రైజ్‌గా ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన విషయాలు అధికారికంగా వెల్లడించాల్సిఉంటుంది. అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఈ నెల 30న విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించినట్లు తెలిసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement