ఈ సీన్‌ సినిమాలో ఎందుకు పెట్టలేదు?

Telugu Movie Gaddala Konda Ganesh Deleted Scene Released - Sakshi

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ నటించిన ‘గద్దలకొండ గణేష్‌’   హిట్‌ టాక్‌ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. గణేష్‌ పాత్రలో వరుణ్‌ నటన ప్రశంసలు అందుకుంటోంది. తమిళ చిత్రం జిగర్తాండకు రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని.. దర్శకుడు హరీశ్‌ శంకర్‌ తెలుగు నేటివిటికి దగ్గరగా తెరకెక్కించారు. అంతేకాకుండా పలు మార్పులు కూడా చేశాడు. చిత్రం విజయం సాధించడంతో యూనిట్‌ మొత్తం సంతోషంగా ఉంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన డీలిటెడ్‌ సీన్‌ ఒకటి చిత్ర బృందం ప్రేక్షకుల కోసం యూట్యుబ్‌లో విడుదల చేసింది. 

ఈ చిత్రంలో గణేష్‌ సినిమా షూటింగ్‌లో ఉండగా.. పెంచలయ్య మనుషులు అతనిపై దాడి చేస్తారు. అప్పుడు వారిని చితకబాదిన గణేష్‌.. పెంచలయ్య(సుబ్బరాజు)కు వార్నింగ్‌ ఇస్తాడు. ఈ సీన్‌లో వరుణ్‌ చెప్పిన డైలాగ్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే ఈ సీన్‌ సూపర్‌గా ఉందని.. ఎందుకు సినిమాలో పెట్టలేదని పలువురు అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా చిత్ర బృందాన్ని ప్రశ్నిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top