సస్పెన్స్‌ సెవెన్‌ | Telugu girl Pujita Ponnada upbeat about her upcoming release 7 | Sakshi
Sakshi News home page

సస్పెన్స్‌ సెవెన్‌

Jun 5 2019 3:08 AM | Updated on Jun 5 2019 3:08 AM

Telugu girl Pujita Ponnada upbeat about her upcoming release 7 - Sakshi

హవీష్‌ హీరోగా నటించిన చిత్రం ‘7’. ఈ చిత్రానికి కెమెరామేన్‌ నిజార్‌ షఫీ దర్శకత్వం వహించారు. కథ అందించి, నిర్మించారు రమేష్‌ వర్మ. రెజీనా, నందితా శ్వేత, త్రిదా చౌదరి, అనీషా ఆంబ్రోస్, అదితీ ఆర్య, పూజితా పొన్నాడ హీరోయిన్లుగా నటించారు. అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై అభిషేక్‌ నామా రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో అభిషేక్‌ నామా మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో కొత్త హవీష్‌ను చూస్తారు. రమేష్‌ వర్మ సస్పెన్స్‌తో కూడిన మంచి కథ అందించారు. ఈ కొత్త కాన్సెప్ట్‌ ఆడియన్స్‌ను థ్రిల్‌ చేస్తుంది’’ అన్నారు. ‘‘సినిమాపై కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. కథ విన్నప్పుడు చాలా ఎగై్జట్‌ అయ్యాను.

నేను విన్న స్టోరీ లైన్‌నే ట్రైలర్‌గా చూపించాం. మంచి స్పందన లభిస్తోంది. అందరూ ప్యాషనేట్‌గా వర్క్‌ చేశారు. రమేష్‌ వర్మ సూపర్‌ కథ అందించారు. కథకు డైరెక్టర్‌ పూర్తి న్యాయం చేశారు. చైతన్యా భరద్వాజ్‌ మంచి సాంగ్స్‌ ఇచ్చారు. జి.ఆర్‌. మహర్షి తన డైలాగ్స్‌తో అదరగొట్టారు. సినిమా బ్లాక్‌ బస్టర్‌ అవుతుంది’’ అని అన్నారు హవీష్‌. ‘‘ఈ చిత్రం నా కెరీర్‌లో సమ్‌థింగ్‌ స్పెషల్‌. రమ్య క్యారెక్టర్‌ నచ్చి బాగా నటించాను. హవీష్‌ లవ్లీ కోస్టార్‌. టీమ్‌ అంతా మంచి పాజిటివ్‌ జోష్‌లో ఉన్నాం’’ అన్నారు నందితా శ్వేతా. ‘‘నిజార్‌ షఫీ గారు ఎన్నో హిట్‌ సినిమాలకు కెమెరామేన్‌గా వర్క్‌ చేశారు. ఆయన దర్శకత్వం వహించిన ఈ ఫస్ట్‌ మూవీ ఆడియన్స్‌కు నచ్చుతుంది’’ అన్నారు పూజిత. ‘‘ఆడియన్స్‌కు ‘7’ డిఫరెంట్‌ మూవీగా నిలిచిపోతుంది’’ అన్నారు త్రిదా చౌదరి.
 

Advertisement
 
Advertisement
Advertisement