తెలుగు దర్శకులపై గ్రంథం | Telugu directors on the book | Sakshi
Sakshi News home page

తెలుగు దర్శకులపై గ్రంథం

Aug 10 2015 11:45 PM | Updated on Sep 3 2017 7:10 AM

1932లో పురుడు పోసుకుంది తెలుగు సినిమా. మన తొలి చిత్రం ‘భక్తప్రహ్లాద’ దర్శకుడు హెచ్.ఎమ్.రెడ్డి మొదలుకుని ఇప్పటి...

1932లో పురుడు పోసుకుంది తెలుగు సినిమా. మన తొలి చిత్రం ‘భక్తప్రహ్లాద’ దర్శకుడు హెచ్.ఎమ్.రెడ్డి మొదలుకుని ఇప్పటి వరకూ ఎంతో మంది దర్శకులు తమ సృజనతో తెలుగు సినిమాకు ఖ్యాతిని ఆర్జించిపెట్టారు. ఈ దర్శకుల ప్రస్థానాన్ని, సృజనాత్మకతను భావితరాలకు తెలియజెప్పే ఉద్దేశంతో తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం ఓ ప్రయత్నం చేస్తోంది. దర్శకుల సమాచారాన్ని సేక రించి ‘తెలుగు దర్శకుల సంక్షిప్త చరిత్ర’ పేరుతో ఓ పుస్తకం తీసుకు రానుంది.
 
 ఈ విశేషాలను దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్ తెలియజేస్తూ-‘‘1932 నుంచి 2007 వరకూ అందరి వివరాలూ సేకరించగలిగాం. కానీ, ఆ తర్వాత దర్శకులుగా పరిచయమైన వారి వివరాలు మాకు లభ్యం కావడం లేదు. అలాంటి దర్శకులు తమ వివరాలను tfda08@gmail.com కు మెయిల్ చేయాలి. త్వరలోనే ఈ గ్రంథాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement