రానాకు జోడీగా తాప్సీ? | tapsee in ranas next film ghazi | Sakshi
Sakshi News home page

రానాకు జోడీగా తాప్సీ?

Nov 5 2015 2:21 PM | Updated on Aug 11 2019 12:52 PM

రానాకు జోడీగా తాప్సీ? - Sakshi

రానాకు జోడీగా తాప్సీ?

కొత్త తరహా కథా కథనాలతో తెరకెక్కుతున్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో మరో ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న సినిమా 'ఘాజీ'. 1971లో ఇండియా పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధంలో...

కొత్త తరహా కథా కథనాలతో తెరకెక్కుతున్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో మరో ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న సినిమా 'ఘాజీ'. 1971లో ఇండియా - పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధంలో, విశాఖపట్నం సమీపంలో సముద్ర జలాల్లో మునిగిపోయిన పిఎన్ఎస్ ఘాజీ జలాంతర్గామి బ్యాక్డ్రాప్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. విశాఖ తీరంలో ఉన్న జలాంతర్గామిపై పాకిస్థాన్ సేనలు ఎలా దాడి చేయగలిగాయన్న మిస్టరీని సినిమాటిక్‌గా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా నావీ అధికారిగా కనిపించనున్నాడు. కొత్త దర్శకుడు సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో కథానాయిక పాత్ర కూడా కీలకం కావటంతో హీరోయిన్ కోసం చాలా రోజులుగా వేట సాగిస్తున్నారు. ముందుగా ఈ పాత్రకు సమంతను తీసుకోవాలని భావించినా, హిందీలో కూడా తెలిసిన హీరోయిన్ అయితే సినిమాకు ప్లస్ అవుతుందని భావించిన చిత్రయూనిట్, ప్రస్తుతం తాప్సీని ఫైనల్ చేయాలని భావిస్తున్నారట.

బాలీవుడ్లో తెరకెక్కిన 'బేబీ' మూవీలో యాక్షన్ సీన్స్లోనూ ఇరగదీసిన ఈ బ్యూటీ, కొంతకాలంగా గ్లామర్ రోల్స్ను పక్కన పెట్టి ప్రయోగాత్మక పాత్రలనే ఎంచుకుంటోంది. దీంతో 'ఘాజీ' సినిమాకు కూడా ఓకే చెబుతుందనే నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.

Advertisement
 
Advertisement
Advertisement