breaking news
PNS ghazi
-
గ్యాప్‌లో మరో సినిమా చేస్తున్నాడు
ప్రభాస్, రాజమౌళి లాంటి స్టార్లు బాహుబలి సినిమాకే పరిమితం అవుతుంటే అదే సినిమాలో మరో లీడ్ రోల్లో నటిస్తున్న రానా మాత్రం గ్యాప్ దొరికినప్పుడల్లా మరో సినిమా చేస్తున్నాడు. బాహుబలిలో భల్లాలదేవగా ఆకట్టుకున్న రానా తొలి భాగం రిలీజ్ అయిన తరువాత బెంగళూర్ డేస్ రీమేక్‌లో నటించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. బాహుబలి-2లో రానా చేయాల్సిన పార్ట్ షూటింగ్‌కు ఇంకా టైమ్ ఉండటంతో, ఇప్పుడు మరో సినిమాను స్టార్ చేశాడు. ఈ విషయాన్ని రానా తన ట్విట్టర్ ద్వారా స్వయంగా ప్రకటించాడు. బాహుబలి 2 ఇప్పటికే స్టార్ట్ కావాల్సిన ఉన్నా ప్రీ ప్రొడక్షన్ పనుల కారణంగా ఆలస్యం అయ్యింది. దీంతో ఈ గ్యాప్‌ను క్యాష్ చేసుకోవాలనుకున్న రానా ఘాజీ సినిమాను గురువారం మొదలుపెట్టాడు. ఇండో-పాక్ యుద్ధ సమయంలో విశాఖ సరిహద్దులో మునిగిపోయిన ఓ జలతార్గమికి సంబంధించిన కథతో తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కొత్త దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటివరకు యుద్ధ సన్నివేశాలతో చాలా సినిమాలు వచ్చినా, జలాంతర్గామి నేపథ్యంతో వచ్చిన తొలి యుద్ధ సినిమా కావడంతో.. దీన్ని పివిపి సినిమా భారీగా తెరకెక్కించనుంది. Pushing my experimental envelope towards mainstream cinema yet again!! #GHAZI (Hindi-Telugu bi-lingual) begins filming today!! — Rana Daggubati (@RanaDaggubati) January 7, 2016 #GHAZI India's first submarine based war film!! Based on true incidents!! Wish us luck!! — Rana Daggubati (@RanaDaggubati) January 7, 2016 Another war film!! But this time underwater!! #GHAZI — Rana Daggubati (@RanaDaggubati) January 7, 2016 -
రానాకు జోడీగా తాప్సీ?
కొత్త తరహా కథా కథనాలతో తెరకెక్కుతున్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో మరో ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న సినిమా 'ఘాజీ'. 1971లో ఇండియా - పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధంలో, విశాఖపట్నం సమీపంలో సముద్ర జలాల్లో మునిగిపోయిన పిఎన్ఎస్ ఘాజీ జలాంతర్గామి బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. విశాఖ తీరంలో ఉన్న జలాంతర్గామిపై పాకిస్థాన్ సేనలు ఎలా దాడి చేయగలిగాయన్న మిస్టరీని సినిమాటిక్‌గా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా నావీ అధికారిగా కనిపించనున్నాడు. కొత్త దర్శకుడు సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో కథానాయిక పాత్ర కూడా కీలకం కావటంతో హీరోయిన్ కోసం చాలా రోజులుగా వేట సాగిస్తున్నారు. ముందుగా ఈ పాత్రకు సమంతను తీసుకోవాలని భావించినా, హిందీలో కూడా తెలిసిన హీరోయిన్ అయితే సినిమాకు ప్లస్ అవుతుందని భావించిన చిత్రయూనిట్, ప్రస్తుతం తాప్సీని ఫైనల్ చేయాలని భావిస్తున్నారట. బాలీవుడ్లో తెరకెక్కిన 'బేబీ' మూవీలో యాక్షన్ సీన్స్‌లోనూ ఇరగదీసిన ఈ బ్యూటీ, కొంతకాలంగా గ్లామర్ రోల్స్‌ను పక్కన పెట్టి ప్రయోగాత్మక పాత్రలనే ఎంచుకుంటోంది. దీంతో 'ఘాజీ' సినిమాకు కూడా ఓకే చెబుతుందనే నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.