టీవీ సీరియళ్లకు ప్రభుత్వం అనుమతి

Tamil Nadu Relaxes Conditions For TV Serial Shootings - Sakshi

చెన్నై: టీవీ సీరియళ్ల షూటింగ్‌లకు అనుమతి ఇవ్వాలని ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్‌కే సెల్వమణి, బుల్లితెర నిర్మాతల మండలి అధ్యక్షురాలు సుజాత విజయ్‌కుమార్, కార్యదర్శి కుష్బూ తదితరులు సీఎంకు  విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. 20 మంది సభ్యులతో కూడిన షూటింగ్‌లకు ప్రభుత్వం అనుమ తి ఇచ్చింది. అయితే ఇది సాధ్యం కాదని, కనీసం 60 మంది సభ్యులతో టీవీ షూటింగ్‌లు నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

వారి విజ్ఞప్తి మేరకు 60 మంది సభ్యులతో షూటింగ్‌లు జరుపుకోవడానికి ముఖ్యమంత్రి శనివారం అనుమతిచ్చినట్టు ప్రకటించారు. షూటింగ్‌ నిర్వహించే ప్రాంతా ల్లో ఆయా జిల్లాల అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని నిబంధనలు విధించారు. ఆదివారం నుంచే సీరియళ్ల షూటింగ్‌లను నిర్వ హించుకోవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు.

చదవండి: మరో మన్మథుడు.. యుక్త వయస్సు మహిళలే టార్గెట్‌ 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top