శ్రుతి ఔట్.. తమన్నా ఇన్.. | Tamannaah may replace Shruti Haasan in PVP's bilingual | Sakshi
Sakshi News home page

శ్రుతి ఔట్.. తమన్నా ఇన్..

Mar 29 2015 3:00 PM | Updated on Sep 2 2017 11:33 PM

శ్రుతి ఔట్.. తమన్నా ఇన్..

శ్రుతి ఔట్.. తమన్నా ఇన్..

శ్రుతి ఔట్.. తమన్నా ఇన్,,! ఇదీ టాలీవుడ్, కోలీవుడ్లో లేటెస్ట్ అప్డేట్. నాగార్జున, కార్తీ, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో పీవీపీ సినిమాస్ నిర్మిస్తోన్న ద్విభాషా చిత్రంలో మొదట నటిస్తానని చెప్పి..

శ్రుతి ఔట్.. తమన్నా ఇన్,,! ఇదీ టాలీవుడ్, కోలీవుడ్లో లేటెస్ట్ అప్డేట్. నాగార్జున, కార్తీ, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో పీవీపీ సినిమాస్ నిర్మిస్తోన్న ద్విభాషా చిత్రంలో మొదట నటిస్తానని చెప్పి.. ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తయిన తర్వాత డేట్లు ఖాళీలేవంటూ నిర్మాతలకు హ్యాండ్ ఇచ్చిన శ్రుతి.. కోర్టు చేత చివాట్లు తిన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సినిమాలో ఆమె స్థానంలో తమన్నాను ఎంపిక చేసినట్లు నిర్మాణ సంస్థ ప్రతినిధుల ద్వారా తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో ఈ వార్తను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

ఫ్రెంచ్ చిత్రం 'ది ఇన్టచబుల్' స్ఫూర్తితో రూపొందుతున్న ఈ సినిమాలో నాగ్ ఓ వ్యాధిగ్రస్తుడిగా, అతని సహాయకుడి పాత్రలో కార్తీ నటిస్తున్నారు.  కార్తీకి జోడిగా తమన్నా ఎంపిక ఖరారవ్వడంతో గతంలో శ్రుతితో చేసిన సీన్లన్నీ రీషూట్ చేయాలని దర్శకుడు వంశీ అనుకుంటున్నాడట. శ్రుతి చర్యతో తాము తీవ్రంగా నష్టపోయామని పీవీపీ సినిమాస్ సంస్థ కోర్టు కెక్కిన సంగతి తెలిసిందే. వివాదం పరిష్కారమయ్యేంతవరకు కొత్త సినిమాలేవీ అంగీకరించొద్దని కోర్టు శ్రుతి హాసన్ను ఆదేశించింది. తమన్నా ప్రస్తుతం రవితేజ సరసన 'బెంగాల్ టైగర్' సినిమాలో నటిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement