సత్తా చూపిస్తా | Tamanna To Join Sye Raa Narasimha Reddy Shooting | Sakshi
Sakshi News home page

సత్తా చూపిస్తా

May 20 2018 12:38 AM | Updated on Sep 19 2019 8:25 PM

Tamanna To Join Sye Raa Narasimha Reddy Shooting - Sakshi

విల్లు ఎక్కుపెట్టినా, కత్తి విసిరినా టార్గెట్‌ మిస్సవ్వరు తమన్నా. వీరనారి పాత్రలో ఆమె గురి ఎలా ఉంటుందో, ధైర్య సాహసాలు ఎలాంటివో ‘బాహుబలి’ సినిమాలో చూశాం. ఇప్పుడు ‘సైరా’ చిత్రం కోసం ఆమె కత్తి పట్టి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొంటున్నారు. బ్రిటీషర్లకు భారతీయ మహిళల సత్తా ఏంటో చూపిస్తున్నారు. చిరంజీవి హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సైరా’. సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై నటుడు–నిర్మాత రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో తమన్నా ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ‘సైరా’ షూటింగ్‌లో తమన్నా పాల్గొంటున్నారు. చిత్రంలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్, సుదీప్, విజయ్‌ సేతుపతి కీలక పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement