లోకనాయకుడి జోడిగా | tamanna got a chance to work with kamal in his next | Sakshi
Sakshi News home page

లోకనాయకుడి జోడిగా

Oct 24 2015 3:39 PM | Updated on Sep 3 2017 11:25 AM

లోకనాయకుడి జోడిగా

లోకనాయకుడి జోడిగా

హీరోయిన్గా స్టార్ ఇమేజ్ అందుకున్నా, సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకోవటంలో ఫెయిల్ అయిన స్టార్ హీరోయిన్ తమన్నా. స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకున్నా, ఆ సినిమాలతో హిట్స్ మాత్రం...

హీరోయిన్గా స్టార్ ఇమేజ్ అందుకున్నా, సక్సెస్ ఫుల్ హీరోయిన్ అనిపించుకోవటంలో మాత్రం ఫెయిలైన స్టార్ హీరోయిన్ తమన్నా. స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకున్నా, ఆ సినిమాలతో హిట్స్ మాత్రం సాధించలేకపోయింది ఈ బ్యూటీ. ఇక సినిమాలు రావనుకున్న సమయంలో బాహుబలితో భారీ ఆఫర్ అందుకున్న ఈ మిల్కీ బ్యూటీ మరో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది.

లోకనాయకుడు కమల్ హాసన్ సరసన నటించటం ప్రతీ హీరోయిన్ కు ఓ కల. ఆ కల తమన్నాకు నిజం కాబోతుందన్న వార్త ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్స్లో హల్చల్ చేస్తోంది. రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్స్తో సినిమాలు చేయడానికి పెద్దగా ఇంట్రస్ట్ చూపించని కమల్ తన తదుపరి సినిమా కోసం తమన్నాను హీరోయిన్గా ఎంపిక చేసుకున్నాడు.

ప్రస్తుతం చీకటిరాజ్యం సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న కమల్, సీనియర్ దర్శకుడు మౌళి అందించిన కథతో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను కూడా చీకటిరాజ్యం దర్శకుడు రాజేష్ సెల్వ డైరెక్షన్లోనే చేయనున్నాడు కమల్. మౌళి మార్క్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో కమల్కు జోడిగా మిల్కీబ్యూటీ తమన్నా ఆడిపాడనుంది.

Advertisement
 
Advertisement
Advertisement