ప్రేమలో ఉన్నమాట నిజమే..!

Tamanna all set to MARRY US-Based Doctor - Sakshi

అవును నేను రొమాన్స్‌ చేస్తున్నాను. అయితే ఎవరితో అన్నది చెప్పనా? అంటోంది నటి తమన్నా. ఇంతకీ ఈ మిల్కీబ్యూటీ తాజాగా ఏం చెప్పదలచుకుంటోందంటే, అమ్మడు మరోసారి లవ్‌లో పడిందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హోరెత్తుతోంది. అమెరికాకు చెందిన ఓ వైద్యుడితో రొమాన్స్‌ చేస్తున్నట్లు మీడియా రచ్చ చేస్తోంది. నటిగా అవకాశాలు తగ్గు ముఖం పట్టడంతో త్వరలోనే పీపీపీ..డుండుండుంకు సిద్ధం అవుతోందనే ప్రచారం జరుగుతోంది. అంతే తమన్నాకు కోపం కట్టలు తెంచుకొచ్చేసింది. దీంతో తన ట్విట్టర్‌ ద్వారా వదంతులపై స్పందిస్తూ తనకు ఎందరితో ప్రేమను అంటగడతారు అంటూ ప్రశ్నించింది. ఆ మధ్య క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీతో చెట్టాపట్టాల్‌ అన్నారు.

 ఆ తరువాత పాకిస్తాన్‌ క్రికెటర్‌ అబ్దుల్‌ రజాక్‌తో లవ్‌ అన్నారు. ఇప్పుడు అమెరికా డాక్టర్‌తో ప్రేమ కలాపాలు అంటూ వదంతులు పుట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక సారి క్రికెటర్, మరోసారి డాక్టర్‌ అంటూ ప్రచారం చేస్తుండడంతో తాను వరుడి వేటలో ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని, నిజం చెప్పాలంటే తాను ప్రేమకు వ్యతిరేకం కాదని, అయితే ప్రేమ అనేది తన వ్యక్తిగతం అని అంది. అలాంటి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల గురించి వదంతులు ప్రచారం చేయడాన్ని ఒప్పుకోనని అంటోంది. ప్రస్తుతానికి తాను సింగిల్‌గానే ఉన్నానని, తన తల్లిదండ్రులు వరుడి వేటలో లేరని స్పష్టం చేసింది. అయితే ‘నేను ప్రేమలో ఉన్న మాట నిజమే, కానీ ప్రేమిస్తుంది సినిమాను మాత్రమే’ అన్నారు. తనకు అవకాశాలు తగ్గాయనడం సరి కాదని అంది.

 ప్రస్తుతం తెలుగులో సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపింది. త్వరలో ప్రభుదేవాకు జంటగా విజయ్‌ దర్శకత్వంలో చిత్రం చేయబోతున్నట్లు చెప్పింది. ఇలా ఖాళీ లేకుండా షూటింగ్‌లో పాల్గొంటుంటే ప్రేమ, పెళ్లి అంటూ వదంతులు ప్రచారం చేయడం తగదని అంది. తాను వివాహం చేసుకుంటే ఆ విషయాన్ని ముందుగానే అందరికీ తెలియజేస్తానని,  అయితే ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదని చెప్పింది. ప్రేమ, పెళ్లి అంటూ ఎవరో అభూత కల్పనలతో ప్రచారం చేస్తున్నారని, వారు ఇకనైనా ఇలాంటివి మానుకోవాలని అంటున్న తమన్నా నటజీవితమే దశాబ్దంన్నరకు చేరుకుంటోందన్నది గమనార్హం.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top