
తమన్నా
.. అంటున్నారు తమన్నా. ఈ మధ్య హీరోయిన్స్ పబ్లిక్ అప్పియరెన్సెస్ ఇస్తే చాలు అనుకోని ఇబ్బందులకు గురవుతున్నారు. ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తించటం లేదా కామెంట్స్ చేయటం జరుగుతోంది. కొంతమంది సంస్కారం మరచిపోయి పాదరక్షలు కూడా విసిరేస్తున్నారు. తమన్నాకు ఈ మధ్య అలాంటి అనుభవమే ఎదురైంది. ఓ షోరూమ్ ఓపెనింగ్‌కు వెళ్లిన తమన్నాపై ఓ ఆకతాయి చెప్పు విసిరిన విషయం తెలిసే ఉంటుంది. అది ఆమెకు కొంచెం దూరంలో పడింది.
ఆ సందర్భలో ఏమీ స్పందించకుండా వెళ్లిపోయారు తమన్నా. ఇప్పుడా సంఘటన గురించి స్పందించారామె ‘‘అలా రియాక్ట్ అయినవాళ్లను ఏమీ చేయలేం. మేం యాక్టర్స్, మా మీద ప్రేమతో వేసే పువ్వులను, ద్వేషంతో విసిరే రాళ్లను ఒకేలా స్వీకరించాలి’’ అని పేర్కొన్నారు తమన్నా. ‘‘తమన్నా అంటే నాకు చాలా ఇష్టం. తను ఈ మధ్య సినిమాలు చేయటం తగ్గించేశారు. ఆవిడను కలుద్దాం అంటే బౌన్సర్స్ ఆమె దగ్గరకు వెళ్లనీకుండా చేశారు. ఆ కోపంతో ఆమె వైపు షూ విసిరేశాను’’ అని పేర్కొన్నాడు ఆకతాయి.