కోటి రూపాయల మోసం | T. Rajender files complaint of fraud on U.S agency | Sakshi
Sakshi News home page

కోటి రూపాయల మోసం

Dec 24 2013 4:48 AM | Updated on Oct 2 2018 3:04 PM

కోటి రూపాయల మోసం - Sakshi

కోటి రూపాయల మోసం

దర్శకుడు, నటుడు టి.రాజేందర్ సోమవారం ఉదయం చెన్నై పోలీ సు కమిషనర్ కార్యాలయంలో తన కురళ్ టీవీ క్రియేషన్ సంస్థ తరపున ఒక ఫిర్యాదు చేశారు.

దర్శకుడు, నటుడు టి.రాజేందర్ సోమవారం ఉదయం చెన్నై పోలీ సు కమిషనర్ కార్యాలయంలో తన కురళ్ టీవీ క్రియేషన్ సంస్థ తరపున ఒక ఫిర్యాదు చేశారు. అందులో తన కొడుకు, నటుడు శింబు పాడిన లవ్ ఆంతమ్ ఆల్బమ్‌ను అమెరికాకు చెందిన గాయకుడు ఏకన్‌తో చేయించేందుకు తమిళనాడుకు చెందిన రామ్‌జీ సోమా, కెనడాకు చెందిన టెరిపాద్‌తో అగ్రిమెంట్ రాసుకున్నట్టు తెలి పారు. లవ్ ఆంతంకు పాడటానికి ఏకన్ బుక్ చేయాలని, లేకుంటే తాము చెల్లించిన ఒక లక్ష 60 వేలు అమెరికన్ డాలర్లు (కోటి రూపాయలు) తిరిగి చెల్లించాలన్న ఒప్పందాన్ని వాళ్లు అతిక్రమించారని పేర్కొన్నారు. 
 
 తాము ఇచ్చిన డబ్బును తిరిగి చెల్లించాలని కోరగా వారు నిరాకరిస్తున్నారని చెప్పారు. వేరే సంస్థ ద్వారా తాము గాయకుడు ఏకన్‌ను చెన్నైకి పిలిపించి లవ్ ఆంతం ఆల్బమ్‌ను పాడించినట్లు వివరిం చారు. ఆ తరువాతనే రామ్‌జీ సోమ టెరిపాద్ మోసం గురించి తనకు తెలిసిందన్నారు. ఈ  విషయమై తాను పంపిన లాయర్ నోటీస్‌ను వారు అందుకోలేదన్నారు.  దీంతో వారిద్దరిపై చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు టి.రాజేందర్ తెలిపారు
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement