అమలాపురం టు షిర్డీ | Swetha Basu Prasad About Mixer Potlam Telugu Movie | Sakshi
Sakshi News home page

అమలాపురం టు షిర్డీ

May 15 2017 11:44 PM | Updated on Sep 5 2017 11:13 AM

అమలాపురం టు షిర్డీ

అమలాపురం టు షిర్డీ

సుందరి ట్రావెల్స్‌ చాలా ఫేమస్‌. అమలాపురం టు షిర్డీ వెళ్లే ఈ ట్రావెల్స్‌ బస్సులో విభిన్న మనస్తత్వాలున్న వ్యక్తులు ప్రయాణం చేస్తారు. ఒక్కొక్కరిది ఒక్కో కథ.

సుందరి ట్రావెల్స్‌ చాలా ఫేమస్‌. అమలాపురం టు షిర్డీ వెళ్లే ఈ ట్రావెల్స్‌ బస్సులో విభిన్న మనస్తత్వాలున్న వ్యక్తులు ప్రయాణం చేస్తారు. ఒక్కొక్కరిది ఒక్కో కథ. ఆ కథల సమాహారంతో రూపొందిన చిత్రం ‘మిక్సర్‌ పొట్లం’. నటుడు భానుచందర్‌ తనయుడు జయంత్, శ్వేతాబసు ప్రసాద్, గీతాంజలి హీరో హీరోయిన్లు.

 ఎం.వి. సతీష్‌ కుమార్‌ దర్శకత్వంలో కలపటపు లక్ష్మీప్రసాద్, కంటే వీరన్న చౌదరి, లంకపల్లి శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలకానుంది. ఈ సందర్భంగా చెన్నైలో ఏర్పాటు చేసిన ప్రీమియర్‌ షోను కె.భాగ్యరాజా, భానుచందర్, ఎస్పీబీ, వెన్నెలకంటి తదితరులు వీక్షించారు. ‘‘శ్వేతాబసు నటన హైలెట్‌. ప్రముఖులందరూ ప్రీమియర్‌ షో చూసి, అభినందించడం సంతోషం’’ అన్నారు దర్శక–నిర్మాతలు.

Advertisement
 
Advertisement
Advertisement