Sushant's 'Dil Bechara' Most Liked Trailer on YouTube in 24 Hours, in The World, Overtakes Avengers Endgame - Sakshi
Sakshi News home page

రికార్డు సృష్టించిన ‘దిల్‌ బేచారా’ టీజర్‌

Jul 8 2020 5:13 PM | Updated on Jul 8 2020 8:34 PM

Sushanth Movie Dil Bechara Teaser Record Of Likes More than Avengers - Sakshi

ముంబై: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్‌ చివరి సినిమా ‘దిల్‌ బేచారా’ టీజర్‌ భారతీయ సినిమాలు వేటికి దక్కని ఒక ఘనమైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ టీజర్‌ విడుదలైన 24 గంటల్లోని 4.8 మిలియన్ల లైక్‌లను సాధించింది. ఇప్పటి వరకు హాలివుడ్‌ సినిమా ‘అవేంజర్స్‌: ఇన్‌ఫినిటి వార్‌’ ఒక్కరోజులో 3.6 మిలియన్‌ లైక్‌లను అందుకొని మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు దిల్‌బేచారా సినిమా అవేంజర్స్‌ను వెనక్కి నెట్టింది. (నక్షత్రానికి సుశాంత్‌ పేరు)

ప్రముఖ నవల ‘ది ఫాల్ట్‌ ఇన్‌ అవర్‌ స్టార్స్‌’ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా మే 8 వతేదీన విడుదల కావాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా ఈ సినిమా వాయిదా పడింది. ఈ సినిమాను సుశాంత్‌కు నివాళిగా డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ ఉచితంగా ప్రసారం చేస్తానని తెలిపింది. యమ్‌ఎస్‌ ధోని చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్‌ రాజ్‌పుత్‌ జూన్‌ 14వ తేదీన ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి  తెలిసిందే. (కనీసం ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి: నటి)


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement