‘ఎన్‌జీకే’ టీజర్‌ రెడీ అవుతోంది!

Surya Completed Dubbing For NGK Teaser - Sakshi

కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తన సత్తా చాటుతున్న హీరో సూర్య. గతేడాది బాలీవుడ్‌ రీమేక్‌గా తెరకెక్కిన గ్యాంగ్‌ సినిమాతో పలకరించగా.. ఈ ఏడాది ‘ఎన్‌జీకే’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రేమికుల రోజు కానుకగా..  ఈ మూవీ టీజర్‌ను రిలీజ్‌ చేయనున్న సంగతి తెలిసిందే.

‘ఎన్‌జీకే’ టీజర్‌ను చిత్రయూనిట్‌ జాగ్రత్తగా దగ్గరుండి కట్‌ చేయిస్తుందని సమాచారం. ఈ టీజర్‌కు సంబంధించిన డబ్బింగ్‌ను సూర్య పూర్తి చేశారు. ప్రస్తుతం సూర్య డబ్బింగ్‌ చెబుతున్న ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. యువన్‌ శంకర్‌ రాజా సంగీతమందిస్తున్న ఈ మూవీకి సెల్వ రాఘవన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో రకుల్‌ప్రీత్‌ సింగ్, సాయి పల్లవి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా సమ్మర్‌లో రానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top